Moviesలావణ్య బ్రతిమిలాడుకుంటున్న అందుకు "నో" అంటున్న వరుణ్ తేజ్.. మెగా హీరో...

లావణ్య బ్రతిమిలాడుకుంటున్న అందుకు “నో” అంటున్న వరుణ్ తేజ్.. మెగా హీరో యవ్వారం తేడాగా ఉందే..?

సినిమా ఇండస్ట్రీలో హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ న్యూస్ ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్ళ నిశ్చితార్ధం చేసుకొని దాదాపు పది రోజులు దాటిపోయింది . కానీ ఇంకా సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన వార్తలు ట్రెండ్ అవుతున్నాయి అంటే ..ఈ జంట ఎంత షాక్ ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు . మొదటి నుంచి మా మధ్య ప్రేమ లేదు తొక్క లేదు అంటూ కబుర్లు చెప్పుకొచ్చిన ఈ జంట.. ఫైనల్లి నిశ్చితార్థంతో ఒక్కటైపోయింది .

త్వరలోనే పెళ్లి బంధంతో మరింతగా ఒకటి అవ్వనున్నారు ఈ జంట . ఇదే క్రమంలో పలు చానల్స్ టిఆర్పి రేటింగ్స్ పెంచుకోవడానికి వీళ్లిద్దరిని పెళ్లికి ముందే ఇంటర్వ్యూ చేయడానికి ట్రై చేస్తున్నారట . ఇప్పటికే మెగా కాంపౌండ్ కి కొన్ని వేల కాల్స్ ఇంటర్వ్యుల కోసం వస్తున్నాయని లావణ్య త్రిపాఠి కూడా ఇంటర్వ్యూ చేయడానికి సిద్ధంగా ఉందని అయితే వరుణ్ తేజ్ మటుకు పెళ్ళికి ముందు ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వము అంటూ తేల్చి చెప్పేస్తున్నారట.

అంతేకాదు నాగబాబు కూడా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చేసారని.. పెళ్లికి ముందు ఏ మీడియా ఛానల్ కి వెళ్లి ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ వార్న్ చేశారట . ఈ క్రమంలోనే లావణ్య ఇంట్రెస్ట్ చూపిస్తున్న సరే వరుణ్ మటుకు నో నో అంటూ ఇంటర్వ్యూలను దూరం పెడుతూనే వస్తున్నారట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది . మరికొద్ది రోజుల్లోనే ఈ జంట ఇటలీలో ఒకటి కాబోతున్నట్లు తెలుస్తుంది . త్వరలోనే పెళ్లి డేట్ అఫీషియల్ గా ప్రకటించనుంది మెగా ఫ్యామిలీ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news