Moviesకోట్లాది మంది జనాలు ఇష్టపడే పవన్ కళ్యాణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో...

కోట్లాది మంది జనాలు ఇష్టపడే పవన్ కళ్యాణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా..? సార్ టేస్టే వేరబ్బ..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్న ..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెప్తే వచ్చే క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ మరి ఏ హీరోకి లేదు అని చెప్పాలి. మరి ముఖ్యంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవన్ సినిమాల విషయంలో కొంచెం లేట్ చేస్తున్న సరే.. అభిమానులు ఆయనని ఇంకా దేవుడు గానే భావిస్తూ ఆయన సినిమాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు,

కాగా ఎంతోమంది కోట్లాది జనాలకు ఫేవరెట్ హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ కు ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఎంత మంచి పెద్ద స్టార్ హీరో అయినా సరే తనకంటూ ఓ ఫేవరెట్ హీరో హీరోయిన్ ఉండే ఉంటారు. ఈ క్రమంలోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..” నాకు ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా కానీ.. అందరికంటే బాగా నచ్చేది.. చూడగానే నమస్కరించాలి అనిపించేది ..సావిత్రి గారు. నేను ఇప్పటికి ఆమె సినిమాలో టీవీలో వస్తే టైం ఉంటే కచ్చితంగా చూస్తానని ..ఆమె సినిమాలు చూస్తూ ఉంటే ఆమె నటనను ఆస్వాదిస్తూ ఉంటే.. తెలియని ప్రశాంతత కలుగుతుందని చెప్పకొచ్చాడు”.

అదే మాటలను ట్రెండ్ చేస్తున్నారు పవన్ అభిమానులు . ఏది ఏమైనా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టేస్ట్ వేరు అంటూ అభిమానులు ఆయన ఇష్టాలను ట్రెండ్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news