Movies‘స్పై’ మూవీ ట్విట్టర్ రివ్యూ: నిఖిల్ ఫ్యాన్స్ కి పండగ..మిగత వాళ్ళకి...

‘స్పై’ మూవీ ట్విట్టర్ రివ్యూ: నిఖిల్ ఫ్యాన్స్ కి పండగ..మిగత వాళ్ళకి దండగ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్ధ్ మంచి జోరు మీద ఉన్న విషయం తెలిసిందే. వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుంటూ హిట్ హీరోహా టాక్ సంపాదించుకున్న నిఖిల్ తాజాగా నటించిన సినిమా “స్పై”. కొద్దిసేపటి క్రితం థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది .

ఈ సినిమాను చూసిన అభిమానులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు . నేతాజీ ఫైల్స్ చుట్టూ తిరిగే ఈ కధ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు . అంతేకాదు ఎప్పటికప్పుడు ఆడియన్స్ సస్పెన్స్ లో పడేసే సీన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అయితే కథ బాగా రాసుకున్న ఆ కథను జనాలకు వివరించడంలో డైరెక్టర్ కూసింత ఫ్లాప్ అయ్యాడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఈ సినిమా లొకేషన్ లకి తగ్గట్టు విజువల్స్ అంత అద్భుతంగా అనిపించడం లేదు అన్న కామెంట్లు సినిమాకి నెగటివ్ టాక్ ను క్రియేట్ చేస్తున్నాయి .అంతే కాకుండా ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ తప్పిస్తే మిగతా నటీనటులు ఎవరు అంతగా సినిమాకి ప్లస్ కాలేదు అన్న కామెంట్లు కూడా ఎక్కువ వినిపిస్తున్నాయి . సినిమా మొత్తానికి కర్త – కర్మ – క్రియ నిఖిలే అని .. వన్ మ్యాన్ షో చేసి ట్రాక్ ఎక్కించడానికి కష్టపడ్డాడని చెప్పుకొస్తున్నారు. నిఖిల్ తో పాటు టీం సపోర్ట్ చేసి ఉంటే సినిమా వేరే లెవెల్ లో ఉండేదని కామెంట్స్ చేస్తున్నారు. మొతానికి స్పై సినిమాతో నిఖిల్ మరో యావరేజ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు అనే చెప్పాలి. చూడాలి మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news