Movies"చరణ్ కి కూతురు పుట్టింది".. చిరంజీవి రియాక్షన్ ఇదే.. అస్సలు ఊహించలేదుగా..!!

“చరణ్ కి కూతురు పుట్టింది”.. చిరంజీవి రియాక్షన్ ఇదే.. అస్సలు ఊహించలేదుగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి .. మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి క్రేజీ స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తన పేరు చెప్పుకొని నలుగురు ఇండస్ట్రీలోకి వచ్చే స్థాయికి ఎదిగిన మెగాస్టార్ అంటే అందరికీ ప్రత్యేకమైన గౌరవం. కాగా ఇలాంటి క్రమంలోనే ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ సైతం ఏకంగా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు .

సినిమాల విషయంలో ఎంత నెంబర్ వన్ గా ఉంటాడో ఫ్యామిలీ విషయంలో అంతే నెంబర్ వన్ గా ఉంటాడు చిరంజీవి . ఈ క్రమంలోనే ఆయన ఎప్పటినుంచో ఆశపడుతున్న తాత పోస్ట్ వచ్చేసింది . మెగాస్టార్ చిరంజీవి రీసెంట్గా మరోసారి తాతయ్యాడు. చరణ్ ఉపాసనలు పండంటి పాపకు జన్మనిచ్చారు . ఈ క్రమంలోని సోషల్ మీడియాలో మెగా ప్రిన్సెస్ హాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు మెగా అభిమానులు .

కాగా చరణ్ ఉపాసనలకు పండంటి పాప పుట్టడంతో సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ విష్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాత అయిన శుభ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ” మా ఇంటికి మెగా మహారాణి వచ్చేసింది. రామ్ చరణ్ ఉపాసన తల్లిదండ్రులయ్యారు ..ఎంతోమంది ఆనందాలకు కారణమయ్యారు.. ఎప్పుడు మీరు ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను.. మమ్మల్ని ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేలా చేశారు” అంటూ తనదైన స్టైల్ లో విషెస్ అందించారు .

అయితే మెగా అభిమానులు కొంతమంది ఉపాసనకు పాప పుట్టడంతో డిసప్పాయింట్ అవుతున్నారు. ఫస్ట్ నుంచి అందరూ చరణ్ కి కొడుకు పుడతాడు మెగా వారసుడు వస్తాడు అంటూ అనుకున్నారని ..కానీ ఇలా పాప పుట్టడంతో కొంచెం డిసప్పాయింట్ అయ్యాము అని కామెంట్స్ చేస్తున్నారు . అయితే పాప అయినా బాబు అయినా ఈ రోజుల్లో ఎవరైనా ఒకటే .. మెగా ఫ్యామిలీ అసలు అలాంటి విషయాల్లో పట్టించుకోదు ..ఈ క్రమంలోనే ఇప్పటికే నలుగురు మనవరాలు ఉన్న ఇంట్లోకి ఐదో మనవరాలుగా చరణ్ కూతురు ఎంట్రీ ఇచ్చింది . దీనితో మెగా ఇంట సంబరాలు షురూ అయ్యాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news