Moviesనందమూరి బిడ్డ మజాకా..ఆ స్టార్ బ్యూటీకి అద్దిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన బాలయ్య..!!

నందమూరి బిడ్డ మజాకా..ఆ స్టార్ బ్యూటీకి అద్దిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన బాలయ్య..!!

గ్లోబల్ లైన్ గా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య ప్రజెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే . రీసెంట్గా బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ అండ్ టీజర్ ని రిలీజ్ చేశారు . భగవత్ కేసరి అనే టైటిల్ పెట్టిన అనిల్ రావిపూడి టీజర్ ని కూడా చాలా అద్భుతంగా కట్ చేశారు . బాలయ్యను అభిమానులు ఎలాంటి లుక్స్ లో చూడాలి అనుకుంటున్నారో అదే విధంగా చూపించి అభిమానుల ఆకలి తీర్చేశాడు .

ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. కూతురుగా శ్రీలీల నటిస్తుంది . ఇప్పటికే దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. కాగా నిన్న కాజల్ బర్త డే సందర్భంగా సినిమా టీం ఆమెకు స్పెషల్ విషెస్ అందిస్తూ .. ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది . చాలా స్టైలిష్ గా ట్రెండీగా శారీలో మెరిసిన కాజల్ ఈ సినిమాలో సైకాలజీ లెక్చరర్ గా కనిపించబోతున్నట్లు ఫస్ట్ లుక్ ఆధారంగా తెలుస్తుంది .

కాగా కాజల్ బర్త్డే సందర్భంగా బాలయ్య ఆమెకు ఎంతో ఇష్టమైన పట్టు చీరను గిఫ్ట్ గా ఇచ్చాడు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే కాజల్ సైతం బాలయ్య గిఫ్ట్ కు సర్ప్రైజ్ అయిపోయిందట . ఇన్నాళ్లు తను ఎంతో మంది స్టార్ హీరోలతో వర్క్ చేశారని ..కానీ ఏనాడు ఒక్కరు కూడా ఏ గిఫ్ట్ ఇవ్వలేదని ..కానీ బాలయ్య గారు తనకు ఎంతో ప్రేమగా పట్టుచీర కొనిచ్చారని.. సర్ప్రైజ్ గా ఫీల్ అయిందట. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news