Moviesచచ్చిన ఆ హీరోయిన్ తో చేయను.. విజయ్ సేతుపతి కోపానికి కారణం...

చచ్చిన ఆ హీరోయిన్ తో చేయను.. విజయ్ సేతుపతి కోపానికి కారణం అదేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బేబ్బమ్మ గా పాపులారి సంపాదించుకున్న కృతి శెట్టి ప్రజెంట్ ఎలాంటి క్రేజీ పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమా ద్వారా తెలుగులో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయిన కృతి శెట్టి .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటిస్తూ రెండు హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది .

అయితే అమ్మడు బ్యాడ్ లక్ నో..దురదృష్టమో తెలియదు కానీ తర్వాత నటించిన నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో కృతి శెట్టి కెరియర్ అటూ ఇటూ కాకుండా మిగిలిపోయింది . టాలీవుడ్ లో అవకాశాలు అందుకో లేకపోతే ఏం.. కోలీవుడ్లో మాత్రం వరుస అవకాశాలు అందుకుంటుంది . అయితే ఇలాంటి క్రమంలోనే విజయ్ సేతుపతి సినిమాలో హీరోయిన్గా ఆఫర్ అందుకునే ఛాన్స్ వచ్చింది కృతిశెట్టికి.

అయితే విజయ్ సేతుపతి మాత్రం చచ్చిన ఆ హీరోయిన్తో నటించను అంటూ చెప్పేశారట. దానికి మెయిన్ రీజన్ ఈ సినిమాలో అమ్మడుని హీరోయిన్గా నటించమంటూ రిక్వెస్ట్ చేశారట . ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతికి కూతురుగా నటించింది కృతిశెట్టి. మరి అలాంటి అమ్మాయితో హీరోయిన్గా అంటే ఎలా చేస్తాం.. చచ్చిన నా లైఫ్ లో ఇక ఆమెతో హీరోయిన్గా చేయను అంటూ మేకర్స్ కి తెగేసి చెప్పేశాడట. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news