Newsఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్: గ్లాస్ తోనే గంట మోగించాడు.....

ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్: గ్లాస్ తోనే గంట మోగించాడు.. సాలే గాళ్ల బాక్సులు బద్ధలైపోవాల్సిందే.. పవన్ ఈజ్ బ్యాక్..(వీడియో)..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఈగర్ గా వైట్ చేసిన మూమెంట్ రానే వచ్చేసింది . మల్టీ టాలెంటెడ్ హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న ఉస్తాద్త్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు మేకర్స్. మరీ ముఖ్యంగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ ఏ రికార్డులను బద్దలు కొట్టిందో మనకు తెలిసిందే.

అందుకు డబల్ రికార్డులను ఈ సినిమా బీట్ చేస్తుందని చిన్న గ్లిమ్స్ తోనే హింట్ ఇచ్చేశాడు హరీష్ శంకర్ . అంతే కాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయనను ఏ రేంజ్ లో చూడాలి అనుకుంటున్నారో..అదే రేంజ్ లో చూపించారు. ప్రజెంట్ పొలిటికల్ యాంగిల్ లో ఎవరెవరికి ఎలా ఎలా ఇచ్చి పడేయాలో చిన్న గ్లిమ్స్ తోనే ఇచ్చేశాడు హరీష్ శంకర్. మరి ముఖ్యంగా చేతిలో జనసేన కి సంబంధించిన టీ గ్లాసుని పెట్టుకొని లోగో పరంగానే సినిమాకి మరింత హైప్ ని క్రియేట్ చేశారు.

పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ గా అట్రాక్టివ్ గా ఉన్నాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దేవి మ్యూజిక్ కూదా బాగా మ్యాచ్ అయ్యింది. అంతేకాదు ఈ లుక్స్ లో దేవి బ్యాక్ గ్రౌడ్ మ్యూజిక్ లో పవన్ ని చూసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు . మరీ ముఖ్యంగా ఆయన చివర్లో చెప్పిన డైలాగ్ కేకపెట్టిస్తుంది. మొత్తానికి ఇన్నాళ్లు పవన్ ఫ్యాన్స్ ఆయనను ఎలా చూడాలి అనుకుంటున్నారో ఎంత మాస్ ఎంత పవర్ఫుల్ లుక్ లో ఆయన పర్ఫామెన్స్ ఆస్వాదించాలి అని అనుకున్నారో వాళ్ళందరికీ ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటిది అంటూ చెప్పేసాడు హరీష్ శంకర్ . మొత్తానికి పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్ సినిమా పడినట్లే అంటూ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news