News"ఎప్పుడు పడతదో ..ఎప్పుడు లేస్తదో నీకే తెలియదు".. "మళ్లీ పెళ్లి" ట్రైలర్...

“ఎప్పుడు పడతదో ..ఎప్పుడు లేస్తదో నీకే తెలియదు”.. “మళ్లీ పెళ్లి” ట్రైలర్ లో ఎన్ని బూతులు ఉన్నాయా..?

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే నరేష్ – పవిత్ర ల పేర్లు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయి. త్వరలో నే వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారని.. నానా రకాలుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి . అవి నిజామా..? అబద్దమా..? పక్కన పెడితే వీళ్ళు ప్రజెంట్ “మళ్లీ పెళ్లి” అనే సినిమా ద్వారా కలిసి నటిస్తున్నారు . రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది . ఈ ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్షణక్షణం ఎంత ఉత్కంఠ భరితంగా చాలా సరదాగా ఫ్యామిలీ ఎమోషన్స్ తో నిండింది . ఒక్క మాటలో చెప్పాలంటే తెర వెనుక నరేష్ జీవితంలో జరిగింది తెరపైన ఉనంది ఉన్నట్లు చూపించేశాడు నిర్మాత ఎం ఎస్ రాజు .

ఈ సినిమాకి ప్రముఖ దర్శక నిర్మాత ఎం ఎస్ రాజు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు . అంతేకాదు నరేష్ ఈ సినిమాని సొంతంగా నిర్మిస్తున్నాడు . ఈ సినిమా మే 26న గ్రాండ్గా థియేటర్స్ లో తెలుగు – కన్నడ భాషలో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ లో కొన్ని బూతు పదాలని క్యాచ్ చేసి మరి ట్రోల్ చేస్తున్నారు మీమర్స్. మరి ముఖ్యంగా ట్రైలర్ స్టార్టింగ్ లో పవిత్రని చూసి పడిపోయిన నరేష్ ని ఆటపట్టిస్తూ .. మీకు వయసైపోయింది సార్ .. ఎప్పుడు పడిపోతదో ఎప్పుడు లేస్తదో మీకే తెలియట్లేదు ..అంటూ ఫన్నీగా చెప్పే డైలాగ్ను బోల్డ్ గా క్రియేట్ చేసి ఆడేసుకుంటున్నారు జనాలు.

అంతేకాదు ఈ ట్రైలర్లో నరేష్ ముగ్గురు భార్యలను కూడా ప్రస్తావించడం హైలైట్ గా మారింది . మరీ ముఖ్యంగా రమ్య రఘుపతి క్యారెక్టర్ చేసిన వనిత అచ్చుగుద్దినట్లు దింపేసింది . అంతేకాదు అన్నపూర్ణమ్మ కూడా ఈ సినిమాలో హద్దులు మీరి బోల్డ్ డైలాగ్స్ చెప్పింది . చివర్లో కన్ను కొడుతూ ఏదో నేర్పిస్తాడు పోవే అంటూ పవిత్రకు చెప్పడం హైలైట్ గా మారింది . అంతేకాదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నరేష్ ఎందుకు పవిత్ర లోకేష్ కి కనెక్ట్ అయ్యాడు.. ఒకసారి ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ ప్రేమ పుట్టదా..? వీళ్ళిద్దరూ కలుస్తున్నప్పుడు మూడో భార్య ఎలాంటి రచ్చ చేసింది ..? నిజంగానే రమ్య రఘుపతి తప్పు చేసిందా ..? అసలు వీళ్ళ మధ్య ప్రేమ ఎలా పుట్టింది..? అన్నవి ఈ సినిమాలో క్లియర్ గా చూపించబోతున్నాడు ఎం ఎస్ రాజు .

ఈ క్రమంలోనే రియల్ స్టోరీని రీల్ లో నిజంగా చూపిస్తుండటం తో ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు జనాలు . చూడాలి మరి ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఎలాంటి హిట్ టాక్ సంపాదించుకుంటుందో..? కొందరైతే బాహుబలి రికార్డ్స్ బీట్ చేసేస్తుంది ఈ సినిమా అంటూ చెప్పుకొస్తున్నారు ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news