Moviesఈ ఫోటోలో ఉన్న ఇద్దరు చిన్నారులు ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్...

ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు చిన్నారులు ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోస్.. ఎవరో గుర్తుపట్టారా..?

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హీరోలు హీరోయిన్ లు చాలా ఇంట్రెస్టింగ్ ఫోటోలు షేర్ చేస్తూ వస్తున్నారు. హీరోయిన్లు అయితే హాట్ హాట్ ఫోటోషూట్లతో రెచ్చిపోతున్నారు. అలాగే కొందరు హీరోయిన్లతో పాటు.. హీరోలు ఫ్యామిలీ ఫోటోలు లేదా తమ చిన్నప్పటి ఫోటోలు షేర్ చేస్తున్నారు. చిన్నప్పటి ఫోటోలు ఇప్పటి ఫోటోలు పక్కపక్కన పెట్టి పోల్చి చూస్తుంటే అసలు గుర్తుపట్టలేని విధంగా ఉంటున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున దగ్గరనుంచి ప్రస్తుతం స్టార్ హీరోలుగా ఉన్న ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్ వరకు అందరి చిన్నప్పటి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇక రీసెంట్గా సంయుక్తమీన‌న్ చిన్నప్పటి ఫోటో కూడా బాగా వైరల్ అయింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోలా చిన్నప్పటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. విచిత్రం ఏంటంటే ఆ ఫోటోలో వారిద్దరూ కలిసి ఉండటంపైగా ఆ ఇద్దరు చిన్నారులు వరస‌ అవుతారు.

అందుకే వాళ్ళిద్దరూ చిన్నప్పుడు కలిసి ఆ ఫోటో దిగారు. ఆ ఇద్దరు ఎవరో కాదు దగ్గుపాటి రానా, అక్కినేని నాగచైతన్య ఈ రెండు కుటుంబాల మధ్య బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే. రాణా మేనత్త దగ్గుబాటి శ్రీలక్ష్మిని ముందుగా నాగచైతన్య తండ్రి స్టార్ హీరో నాగార్జున పెళ్లి చేసుకున్నారు. అనంతరం మనస్పర్ధలు నేపథ్యంలో వారు విడిపోయారు. అయితే రానా నాగచైతన్య వరుసకు బావబామ్మర్దులు అవుతారు.

వారిద్దరి మధ్య ఎంతో ఆప్యాయత అనురాగాలు ఉంటాయి. రామానాయుడు కూడా తన కుమార్తె మనవడు అయినా నాగచైతన్యను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఇక సురేష్ బాబు కూడా మేనల్లుడు నాగచైతన్య ఇటు తమ్ముడు వెంకటేష్ ను హీరోలాగా పెట్టి వెంకీ మామ అనే మల్టీ స్టార్ సినిమా తెర‌క్కెకించారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇక సురేష్ బాబు త్వరలోనే రానా, నాగచైతన్య కాంబినేషన్ లో మరో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news