Moviesఐశ్వ‌ర్య విడాకుల వెన‌క క‌న్నీటి గాధ‌... స‌ల్మాన్‌ను మించి అభిషేక్ టార్చ‌ర్...

ఐశ్వ‌ర్య విడాకుల వెన‌క క‌న్నీటి గాధ‌… స‌ల్మాన్‌ను మించి అభిషేక్ టార్చ‌ర్ పెట్టాడా…!

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న హీరోయిన్. ప్రపంచ సుందరిగా ఎంపికైన ఐశ్వర్యరాయ్ కు ముందుగా సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తన సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత మరో సౌత్ ఇండియన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన జీన్స్ సినిమాలోనూ ఆమె నటించింది. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అవడంతో బాలీవుడ్లో తిరుగులేని మహారాణిగా దూసుకుపోయింది. వరుసగా స్టార్ హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించి సూపర్ డూపర్ హిట్లు కొట్టింది.

కెరీర్ పరంగా ఐశ్వర్య గొప్ప అందగత్తె. ఇంకా చెప్పాలంటే చాలామంది సినీ అభిమానుల దేవత. అయితే వ్యక్తిగత జీవితంలో ఆమె కూడా ఎన్నో తప్పటడుగులు వేసింది. ప్రేమలో డేటింగులు అంటూ ఆమె చుట్టూ ఎన్నో వార్తలు కూడా వచ్చాయి. ముందుగా కండల వీరుడు సల్మాన్‌ఖాన్ తో ఆమె ప్రేమలో పడింది. ఇద్దరు కలిసి సహజీవనం కూడా చేసుకున్నారు.. పెళ్లి చేసుకుంటారు అనుకుంటున్న సమయంలో సల్మాన్ పెట్టిన టార్చర్ తట్టుకోలేక ఐశ్వర్య అతడికి దూరమైంది.

ఆ తర్వాత మరో హీరో వివేక్ ఒబెరాయ్‌తోనూ కొన్నాళ్లు కలిసి ఉంది. ఏం జరిగిందో తెలియదు కానీ.. వివేక్ ని కూడా వదిలించుకుంది. ఆ తర్వాత వయసులో తనకంటే ఏడాది చిన్నోడు అయినా అభిషేక్ బచ్చ‌న్‌ను సైలెంట్ గా పెళ్లి చేసుకుంది. 2007లో ఈ దంపతులు పెళ్లి జరగగా.. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ ఎడమొఖం.. పెడ‌మొఖంగా ఉంటున్నారు. విడాకులు కూడా ఖరారు అయ్యాయని.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని ప్రచారం జరుగుతుంది.

ఎంతో అన్యోన్యంగా ఉండే వీరి మధ్య అసలు ఏం జరిగింది ? అన్నది పరిశీలిస్తే అభిషేక్.. ఐశ్వర్యను బాగా టార్చర్ చేస్తున్నాడు అని.. అసలు పబ్లిక్ లోకి ఇద్దరు కలిసి వస్తే ఆమెను ఒక భార్య‌గా గౌరవించేందుకు.. కనీసం ఆమెతో సన్నిహితంగా ఉండేందుకు కూడా ఇష్టపడడు అని.. తాను గొప్ప అన్న ఇగో ఫిలిం చూపిస్తూ ఉంటాడని బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. వాస్తవంగా చూస్తే ఐశ్వర్య సినిమాలు ఐశ్వర్య క్రేజ్ ముందు అభిషేక్ బలాదూర్.

కేవలం అమితాబచ్చన్ కొడుకు అన్న బ్రాండ్ మాత్రమే అతడికి ఉంది. దీనికి తోడు తల్లి జయాబ‌చ్చన్ ఐశ్వర్య కు చాలా కండిషన్లు పెడుతుంది. ఐశ్వర్య సినిమాలు మానేసి ఇంటిప‌ట్టునే ఉండాలట. గ్లామర్ ప్రపంచంలో ఒక వెలుగు వెలిగిన ఐశ్వర్య అలా ఉండేందుకు ఇష్టపడటం లేదు. ఇటు భర్త.. అటు అత్త ఇద్దరు కలిసి తనను బాగా టార్చర్ పెడుతూ ఉండడంతో పాటు ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ వ‌స్తున్నారు.

ఆమె ప‌రిస్థితి బ‌య‌ట ప‌ల్ల‌కీల మోత‌.. ఇంట్లో ఈగ‌ల మోత అన్న‌ట్టుగా ఉంది. వాటిని తట్టుకోలేకే ఆమె ఆ కుటుంబానికి దూరంగా ఉంటుందని తెలుస్తోంది. ఏది ఏమైనా త్వరలోనే వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారని బాలీవుడ్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news