MoviesBig Breaking : శోకసంద్రంలో సంగీత ప్రపంచం..ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం..!!

Big Breaking : శోకసంద్రంలో సంగీత ప్రపంచం..ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం..!!

సినీ పరిశ్రమంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి . ఓ స్టార్ సెలబ్రిటీ మరణించారు అన్న విషాద వార్త ఛాయలు మరవకముందే మరో స్టార్ సెలబ్రెటీ మరణిస్తూ ఉండడం సినిమా ఇండస్ట్రీలో ఉండే జనాలకు తీరని శోకాన్ని మిగులుస్తుంది. రీసెంట్ గానే ఢీ షో డాన్స్ ద్వారా ప్రోగ్రాం కొరియోగ్రాఫర్ గా మారిన చైతన్య మాస్టర్ సూసైడ్ చేసుకొని మరణించిన విషయం తెలిసిందే. ఈ బాధ నుంచి ఇంకా జనాలు కోలుకోక ముందే మరో విషాద వార్త సినీ ఇండస్ట్రీ జనాలను తీవ్రశోఖసంద్రంలోకి నింపేసింది .

లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది . ఆయన అన్న కొడుకు పావళర్ శివన్ మంగళవారం రోజు అకస్మాత్తుగా మరణించారు . అప్పటివరకు బాగానే ఉన్నా గుండె పోటు రావడంతో స్పాట్లోనే మరణించారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు అధికారికంగా ధ్రువకరించారు. ఇళయరాజా అన్నయ్య తండ్రి పేరు పావళర్ వరదరాజన్ .ఆయన కూడా సంగీత దర్శకుడుగా.. పాటల రచయితగా.. గాయకుడిగా ..ఎన్నో సినిమాలకు పని చేశారు.

మరీ ముఖ్యంగా ఇళయరాజా కి పావళర్ అంటే చాలా ఇష్టం కూడా.. ఆయన వద్ద సంగీతం నేర్చుకున్నాడు . ఈ క్రమంలోనే పవర్ శివ మరణ వార్త ఇళయరాజా కు బాధ కలిగిస్తుంది . అంతేకాదు ఇళయరాజా ఆయన పార్థివ దేహం వద్ద వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యాలు చూస్తుంటే అభిమానులకి చాలా బాధగా ఉంది. పావళర్ శివన్ మంచి గిటార్ వాయిద్యాకారుడు. ఆయన సంగీత దర్శకుడుగా కూడా రెండు మూడు చిత్రాల్లో నటించారు. కానీ ఆయన సక్సెస్ కాలేకపోయాడు. చిత్ర ప్రముఖులతో కూడా ఆయనకి ఫ్రెండ్షిప్ ఉంది. ఈ క్రమంలోనే ఆయన మృతితో తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఆయనకి సంతాపం తెలుపుతున్నారు. అన్న కొడుకు మరణించడంతో ఇళయరాజా కన్నీరు మున్నీరు విలపిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news