Moviesమదర్స్ డే స్పెషల్ : అభిమానులకు గుడ్ న్యూస్ .. ఉపాసనకు...

మదర్స్ డే స్పెషల్ : అభిమానులకు గుడ్ న్యూస్ .. ఉపాసనకు పుట్టబోయేది ఎవరంటే..?

నేడు “మదర్స్ డే”.. ఈరోజు స్టార్ సెలబ్రిటీస్ సామాన్య ప్రజలందరూ తమ లైఫ్ లో అమ్మాయి ఎంత ఇంపార్టెంట్ అనే దాని గురించి స్టేటస్ లు.. స్పెషల్ స్టోరీలు పెడుతున్నారు . అంతేకాదు పలువురు స్టార్ ప్రముఖులు తమ అమ్మతో ఉన్న స్పెషల్ ఫీలింగ్ ను అభిమానులకు షేర్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే మదర్స్ డే కానుకగా అభిమానులకు ఉపాసన మెగా ట్రీట్ అందించింది . తన ఫుల్ బేబీ బంప్ ఫొటోస్ ను రిలీజ్ చేసింది . మనకు తెలిసిందే మెగా కోడలుగా పేరు సంపాదించుకున్న ఉపాసన గర్భవతి.

గత పదేళ్లుగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన గుడ్ న్యూస్ చెప్పాడు మెగాస్టార్ చిరంజీవి . అప్పటినుంచి ఉపాసనకి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది . మరి ముఖ్యంగా ఉపాసనకి సంబంధించిన ప్రెగ్నెన్సీ న్యూస్ లో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాని ఏ రేంజ్ లో షేక్ చేసాయో తెలిసిందే. కాగా మదర్స్ డే సందర్భంగా ఉపాసన బేబీ బంప్ ఫొటోస్ రివీల్ చేస్తూ సుదీర్ఘంగా పోస్ట్ చేసింది .

“సరైన సమయంలో తల్లిగా మారిన నేను .. గర్వంగా ఫీల్ అవుతున్నాను.. నా బిడ్డకు అంతులేని ప్రేమని ఇవ్వడానికి రెడీగా ఉన్నాను.. ఎమోషనల్ గా ప్రిపేర్ అయ్యాను ..అప్పుడే నేను గర్భం దాల్చాను . నాకు పుట్టబోయే బిడ్డ ప్రేమ సంరక్షణకు పోషణకు అర్హుడు అర్హురాలు ” అంటూ కామెంట్ పెట్టారు. దీంతో ఉపాసన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి . అంతేకాదు ఉపాసన ఫుల్ బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

త కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో మెగా కోడలు ఉపాసన పుట్టబోయేది పాపే అంటూ ప్రచారం జరుగుతుంది . దానికి కారణం ఆమె ఇచ్చిన పార్టీ వేడుకల్లో బేబీ పింక్ కలర్ డ్రెస్ వేసుకోవడమే అంటూ తెలుస్తుంది . జనరల్ గా లేడీస్ పింక్ అంటే ఇష్టం ఉంటుంది . బేబీస్ – కిడ్స్ ఎక్కువగా లైక్ చూస్తూ ఉంటారు . ఈ క్రమంలోనే ఉపాసన కూడా సింబాలిక్ గా తనకి పుట్టబోయేది పాపే అంటూ చెప్పగానే చెప్పేసింది అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news