Newsస‌మంత - విజ‌య్ రొమాన్స్ అదుర్స్‌… బ్యూటిఫుల్‌గా ' ఖుషి '...

స‌మంత – విజ‌య్ రొమాన్స్ అదుర్స్‌… బ్యూటిఫుల్‌గా ‘ ఖుషి ‘ ప్రోమో ( వీడియో)

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా స్టార్ హీరోయిన్ సమంత కాంబినేషన్ లో తెర‌కెక్కుతోన్న సినిమా ఖుషి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా 2001లో వ‌చ్చిన బ్లాక్‌బ‌స్ట‌ర్ క్లాసిక్ టైటిల్‌నే మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు రిపీట్ చేస్తూ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ప‌వ‌న్ హిట్ సినిమా టైటిల్ కావ‌డంతో పాటు ఆ ఖుషి సినిమాలాగానే ఇది కూడా ల‌వ్ స్టోరీ కావ‌డంతో ఖ‌చ్చితంగా ఈ సినిమా వేరే లెవ‌ల్లో ఉంటుంద‌నే అంటున్నారు.

ఇక ఈ సినిమాకు శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గ‌తంలో ఇదే స‌మంత – నాగ‌చైత‌న్య కాంబినేష‌న్లో వ‌చ్చిన మ‌జిలీ సినిమాకు కూడా శివ డైరెక్ట‌ర్‌. ఇక ఇటు యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ త‌ర్వాత న‌టిస్తోన్న సినిమా కావ‌డం.. అటు విడాకుల త‌ర్వాత స‌మంట న‌టిస్తోన్న సినిమాల‌లో ఒక‌టి కావ‌డం.. వీరిద్ద‌రి కెమిస్ట్రీ ఇప్ప‌టికే పోస్ట‌ర్ల‌లో బాగా హైలెట్ అవ్వ‌డంతో ఖుషి పై మంచి అంచ‌నాలు ఉన్నాయి.

తాజాగా ఖుషి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేశారు. పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసిన ఈ సాంగ్ ప్రోమో చూసేందుకు సింఫుల్‌గా, బ్యూటిఫుల్‌గా ఉంది. ఇక హీషమ్ అబ్దుల్ ఇచ్చిన సోల్ ఫుల్ మ్యూజిక్ అయితే వినేందుకు విన‌సొంపుగా ఉంద‌నే చెప్పాలి. ఇక ఈ ప్రోమో చూస్తుంటేనే వారిద్ద‌రి మ‌ధ్య మంచి ఇంట్ర‌స్టింగ్ ల‌వ్ స్టోరీ ఉండ‌బోతోంద‌ని.. విజ‌య్ – స‌మంత కెమిస్ట్రీ కూడా ఓ రేంజ్‌లో ఉండ‌బోతోంద‌న్న క్లారిటీ అయితే వ‌చ్చేసింది.

మ‌రి ఈ ఫ‌స్ట్ సింగిల్ మంచి ప్రామీసింగ్‌గా ఉంది. ఇక ఈ సాంగ్ ఈ నెల 9న రానుండగా మైత్రి మూవీ నిర్మాణం వహిస్తున్న ఖుషి ఈ సెప్టెంబర్ 2న రిలీజ్ కాబోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news