Moviesశాకుంతలం పబ్లిక్ రివ్యూ : కుర్రాళ్లకు తలనొప్పి.. ముసలోళ్ళకి మెడ నొప్పి..!!

శాకుంతలం పబ్లిక్ రివ్యూ : కుర్రాళ్లకు తలనొప్పి.. ముసలోళ్ళకి మెడ నొప్పి..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా శాకుంతలం . డైరెక్టర్ గుణశేఖర్ ఎంతో ఇష్టపడి కష్టపడి తెరకెక్కించిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే గ్రాండ్గా రిలీజ్ అయింది . కాగా ఇన్నాళ్లు సమంతకు సంబంధించిన శాకుంతలం సినిమా ఎలా ఉంటుంది ..? ఎలా ఉండబోతుంది..? అసలు హిట్ కొడుతుందా..? లేదా..? అని జనాలు తెగ ఆలోచించేశారు. వాళ్ళు అన్నిటికీ చెక్ పెడుతూ సమంత సినిమా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను నమోదు చేసుకునింది.

కధ పరంగా అందరికీ తెలిసిందే . మహాభారతంలోని రియల్ ఎపిక్ స్టోరీ . అయితే ఈ విషయాన్ని ఈ కథని మార్చడానికి లేదు .. మార్చిన జనాలు ఊరుకోరు .. ఉన్న కథను ఉన్నట్లు తెరకెక్కించడమే . గుణశేఖర్ చేయాల్సిందల్లా గ్రాఫిక్స్.. విజువలైజేషన్స్ లో జనాలను మెప్పించడం . ఈ విషయంలో గుణశేఖర్ ఎంత డబ్బు పెడితే అంత మంచిది. అయితే ఎంత డబ్బు పెట్టినా సరే గుణశేఖర్ ఆ విషయంలో ఫ్లాప్ అయ్యాడనే చెప్పాలి . పాపం గుణశేఖర్ ఈ సినిమా ద్వారా ఏదో తీసేద్దాం.. పొడి చేద్దామని అనుకున్నాడు . కానీ అవంత ఏది జరగలేదు అంటూ ఫస్ట్ షో తోనే తెలిసిపోయింది.

అంతేకాదు ఇందులో సమంత నటన కూడా 50 – 50 పెర్ఫార్మెన్స్ తో ఉంది. మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే బాగా డల్ అయిందని చెప్పాలి . మరి ముఖ్యంగా ఈ సినిమాలో దేవ్ క్యారెక్టర్ అసలు ఎందుకు ఉంది ..? సినిమాలో చెప్పుకోదగ్గ ఎలిమెంట్స్ ఏమీ లేవు .. విజువలైజేషన్ ద్వారా కళ్ళకు కట్టినట్లు చూపించాలి. మరీ ముఖ్యంగా నేటి కాలం పిల్లలకి ఇలాంటి స్టోరీలు అర్థం కాదు .. విజువలైజేషన్ ద్వారా చెప్తే క్లియర్ గా చూస్తారు .. చిన్న పిల్లలు కూడా విజువలైజేషన్స్ లో బాగా అర్ధం చేసుకుంటారు.

ఎందుకో కోట్లు ఖర్చు చేసిన గుణశేఖర్ ఆ విషయంలో సక్సెస్ కాలేకపోయాడు . మరీ ముఖ్యంగా ఎంతో ఆశలతో సమంత సినిమాకి చూడడానికి వెళ్ళిన జనాలకు కుర్రాలకు తలనొప్పి తప్పించాడు గుణశేఖర్ .అంతేకాదు కుర్రాళ్ళ సైతం సినిమాపై రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. ఏదో ఊహించుకొని వెళ్తే సమంత సినిమాకి తలనొప్పి పక్క అని.. కుర్రాళ్ళు వెళితే జండు బామ్ తీసుకోని వెళ్ళమని సజెషన్స్ ఇస్తున్నారు . టైం పాస్ సినిమా అంటూ చెప్పుకొచ్చారు జనాలు . ఈ క్రమంలోని సమంత శాకంతలం సినిమా కొన్ని ప్లస్లు కొన్ని నెగటివ్ పాయింట్లతో దూసుకుపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news