Moviesగుణశేఖర్ తెలుగు హీరోల కామెంట్స్ ఆయనకేనా..? సమంత ని ఆ హీరో...

గుణశేఖర్ తెలుగు హీరోల కామెంట్స్ ఆయనకేనా..? సమంత ని ఆ హీరో అంతలా అవమానించాడా..?

ప్రజెంట్ సమంత ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఆత్రుతగా వెయిట్ చేస్తున్న సినిమా శాకుంతలం . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణ శేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మరికొద్ది గంటల్లోనే ధియేటర్స్ లో రిలీజ్ కాబొటుంది. ఇప్పటికే థియేటర్స్ వద్ద సమంత అభిమానుల హంగామా మొదలైపోయింది . భారీ కటౌట్లతో .. ఫ్లెక్సీలతో ..హీరోలకు మించిన స్టార్ డమ్ తో దూసుకుపోతుంది సమంత . ఈ క్రమంలోనే రీసెంట్గా డైరెక్టర్ గుణశేఖర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి .

మనకు తెలిసిందే టాలీవుడ్ లో స్టార్ హీరోలు గెస్ట్ రోల్ లో చేయరు . వాళ్ళ ఇమేజ్ పడిపోతుంది అన్న భయమో.. క్రేజ్ తగ్గిపోతుందన్న భాధనో తెలియదు కానీ ..చాలా తక్కువ మంది అలాంటి రోల్స్ ని యాక్సెప్ట్ చేస్తుంటారు . అయితే ఇదే విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చేసారు డైరెక్టర్ గుణ శేఖర్. “మన తెలుగు హీరోలు ఆ విషయంలో మారాలని ..పాన్ ఇండియా సినిమాలో నటించడం కాదు ..

మరో హీరో సినిమాలో కూడా గెస్ట్ రోల్ చేయాలి.. అప్పుడే ఇండస్ట్రీలో కొత్త ఉత్సాహం వస్తుంది.. హీరోలకి మంచి ఒపీనియన్ కలుగుతుంది ..ఈ సినిమాలో దృశ్యంతుడి పాత్ర చాలా కీలకం. ఈ సినిమా కోసం ఎంతో మంది టాలీవుడ్ హీరోలను అనుకున్నాను.. కానీ వాళ్ళు ఎవరు చేయరని నాకు తెలుసు.. అందుకే నేనువేరే నటుడిని తీసుకున్నాను ..గతంలో నా సినిమాలో అల్లు అర్జున్ ఓ గెస్ట్ రోల్ లో నటించాడు. అది గెస్ట్ రోల్ అని చెప్పడానికి లేదు . ఆ పాత్ర సినిమాకే ప్రత్యేకం . ఆ పాత్ర ద్వారా అల్లు అర్జున్ ఎంతటి పేరు సంపాదించుకున్నాడు మనందరికీ తెలిసిందే. ఇప్పటికైనా ఈ విషయాన్ని అర్థం చేసుకుని టాలీవుడ్ హీరోలు నటిస్తే బాగుంటుంది “.

అయితే “ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో ని ఉద్దేశించే గుణశేఖర్ ఇలా అన్నాడని ..సమంత సినిమా అంటే .. ఆ హీరో నవ్వేసి జాలీగా ఓ లుక్కేసి ఈ మూవీని రిజెక్ట్ చేశాడని.. ఆమె సినిమాలో గెస్ట్ రోలా అంటూ వ్యంగ్యంగా స్పందించారని ..ఈ క్రమంలోనే ఆ పేరు గల పెద్దమనిషి నేమ్ ని రివిల్ చేయకుండా ఇలా చెప్పాల్సిన మాట సూటిగా చెప్పేసాడు “అంటూ కొన్ని న్యూస్ లు వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news