Moviesనాగ‌చైత‌న్య ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీ… చైతు - శోభిత ప్రేమ‌లో ఎంట‌ర్ అయిన...

నాగ‌చైత‌న్య ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీ… చైతు – శోభిత ప్రేమ‌లో ఎంట‌ర్ అయిన మ‌రో హీరోయిన్‌..!

అక్కినేని హీరో నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చేసాక ఇప్పుడు తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ లో ఉన్నాడని.. ఆమెను త్వరలోనే పెళ్లి చేసుకుంటాడని వార్తలు వస్తున్నాయి. గత యేడాదికాలంగా చైతు – శోభిత కలిసి చట్టపట్టాలేసుకొని తిరుగుతున్న మాట వాస్తవం. తాజాగా వారు ఇద్దరు లండన్ లోని ఒక రెస్టారెంట్లో ఉన్న ఫోటో కూడా బయటకు వచ్చింది. చైతు – శోభిత ప్రేమలోకి ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఎంటర్ అయినట్టు టాలీవుడ్లో గసగుస‌లు వినిపిస్తున్నాయి

దీంతో ఇప్పుడు ఈ ముగ్గురు మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తున్నట్టు కూడా ఒకటే చర్చి నడుస్తోంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు దక్షా న‌గార్కర్. ఆమె పేరు చెబితే వెంటనే గుర్తు రాకపోవచ్చు. అయితే బంగార్రాజు సినిమా వేడుకలో నాగచైతన్యను చూసిన సమయంలో ఆమె కంటిచూపుతో సైగ చేసిన వీడియో బాగా వైరల్ అయింది. దాంతో దక్ష గురించి చాలా ప్రచారం జరిగింది.. నాగచైతన్య – దక్ష‌ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని వార్తలు కూడా వచ్చాయి.

ఆ వీడియో బాగా వైరల్ అవడంతో దక్ష కూడా క్లారిటీ ఇచ్చింది. చైతు లాంటి అబ్బాయిని ఎలాంటి ?అమ్మాయి అయినా కోరుకుంటుందని.. అతడు చాలా సింపుల్ గా ఉంటాడని.. అమ్మాయిల విషయంలో చాలా కేర్ తీసుకుంటాడని.. అమ్మాయిలను చాలా గౌరవిస్తాడని చెప్పింది. బంగార్రాజు సినిమా షూటింగ్ సమయంలో నాతో కౌగిలింత సన్నివేశాలు.. ముద్దు సీన్లు ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతూ నటించేవాడని.. ఆ సీన్లు షూటింగ్ అయ్యాక సారీ చెప్పేవాడు అంటూ నాగచైతన్య గురించి చెప్పింది.’

అయితే బంగార్రాజు వేడుక సందర్భంగా కన్ను గీటుతూ చేసిన సైగ‌ గురించి మాత్రం ప్రస్తుతానికి ఏం చెప్పను అన్నట్టు టాపిక్ మార్చేసింది. దక్ష మాత్రం నాగచైతన్యను వన్ సైడ్ లవ్ చేస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. చైతు మాత్రం శోభితను ఇష్టపడుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ లో ఎవరు ఎవరికి పడిపోతారు ? ఈ మూడు ముక్కలాట ప్రేమ కథకు ఎలా ఎండ్‌ కార్డు పడుతుంది.. అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news