Moviesప్ర‌భాస్ ' ఆదిపురుష్ ' ర‌న్ టైం లాక్‌ .... మూలిగే...

ప్ర‌భాస్ ‘ ఆదిపురుష్ ‘ ర‌న్ టైం లాక్‌ …. మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డిందిరో…!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వ‌రుస పెట్టి పాన్ ఇండియా ప్రాజెక్టులలో న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేతిలో ఆదిపురుష్ – స‌లార్ – స్పిరిట్ – ప్రాజెక్ట్ కే – రాజా డీల‌క్స్ ఉన్నాయి. ఈ లైన‌ప్‌లో భాగంగా ముందు ఆదిపురుష్ సినిమా వ‌స్తోంది. ప్ర‌భాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన చిత్రం ఆదిపురుష్.

ఈ సినిమాపై ఎందుకో గాని ముందు నుంచి ఎవ్వ‌రికి అంచ‌నాలు లేవు. పైగా సినిమా నుంచి రిలీజ్ అవుతోన్న స్టిల్స్‌, టీజ‌ర్లు కూడా మ‌రి నాసిర‌కంగా ఉన్నాయని.. అస‌లు ఆ పోస్ట‌ర్ల‌లో ఉన్న‌ది రాముడు, సీత‌, ఆంజ‌నేయుడేనా ? అని భారీ ఎత్తున ట్రోలింగ్ న‌డుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా ర‌న్ టైం కూడా లాక్ అయ్యింది.

ఆదిపురుష్ ర‌న్ టైం ఏకంగా 174 నిమిషాల పాటు సుదీర్ఘంగా ఉంది. అస‌లే సినిమాపై ఇప్ప‌టికే నెగ‌టివ్ టాక్ వ‌చ్చేసింది. అస‌లు ఇది సినిమాయా ? యానిమేష‌న్ బొమ్మ‌ల చిత్ర‌మా ? అన్న డౌట్లు వ‌స్తున్నాయి. ఇలాంటి టైంలో ఇంత లాంగ్ ర‌న్ టైం అంటే అది మూలిగే న‌క్క మీద తాటిపండు ప‌డిన‌ట్టుగా ఉంద‌నే అంటున్నారు.

సినిమా ఏ మాత్రం బోర్ కొట్టినా అస‌లు ఆదిపురుష్ ఘోర‌మైన ప్లాప్ సినిమా అవుతుంది. ప్రేక్ష‌కులు ప‌ట్టించుకోరు. ఇంత భారీ ర‌న్ టైంను ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ఎక్క‌డా బోర్ కొట్టించ కుండా ఎలా తీశారు ? అన్న‌దే స‌స్పెన్స్‌. టీ సిరీస్ మరియు రెట్రో ఫైల్స్ నిర్మించిన ఆదిపురుష్ IMAX మరియు 3D ఫార్మాట్లలో జూన్ 16న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news