Moviesఅప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు గోపీచంద్..సుమ కి స్ట్రైట్ వార్నింగ్ ఇస్తున్న స్టార్...

అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు గోపీచంద్..సుమ కి స్ట్రైట్ వార్నింగ్ ఇస్తున్న స్టార్ హీరోలు..అసలు ఏమైందంటే..?

ఈ మధ్యకాలంలో యాంకర్ సుమ పేరు సోషల్ మీడియాలో.. సినిమా ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆమె టంగ్ స్లిప్ అవుతూ ఎన్టీఆర్ 30 కి సంబంధించిన అప్డేట్ ఇస్తారు అంటూ ఒక క్రేజీ ప్రకటన చేసి .. ఎన్టీఆర్ అభిమానులకి కోపం తెప్పించి ఎన్టీఆర్ ఆగ్రహానికి గురైంది సుమ . అప్పటినుంచి ఏ షోలో మాట్లాడుతున్న ఆచితూచి ఆలోచించి నిర్ణయించుకొని మాట్లాడుతుంది సుమ.

కాగా అలాంటిఓ తల తిక్కల పనితోనే మరోసారి హీరో గోపీచంద్ కు కోపం తెప్పించినట్లు ఉంది యాంకర్ సుమ . ఈ క్రమంలోనే యాంకర్ సుమ గొంతుని గట్టిగా నొక్కి పెట్టేశాడు హీరో గోపీచంద్. ప్రజెంట్ దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . మనకు తెలిసిందే సుమ హోస్ట్ గా చేస్తున్న షో సుమా అడ్డ . రీసెంట్గా ఈ షో కి గోపీచంద్ రామబాణం టీం గెస్ట్ గా హాజరయ్యారు. గోపీచంద్ కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన రామబాణం సినిమా మే ఐదున గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా సుమా అడ్డ షోకి వచ్చిన గోపీచంద్ సుమని ఆడుకున్నాడు . ఈ క్రమంలోని సుమ వేసే పంచులకి ఘాటుగా బదులిచ్చారు .. మీరు సినిమాలో హీరోయిన్ అయితే ఆ సినిమాలో నేనే విలన్ చెప్పిన గోపీచంద్ మరోసారి సుమ వేసిన భారీ పంచుకు రివర్స్ కౌంటర్ వేశారు . ఈ క్రమంలోనే సడన్గా గేమ్ ఆడుతున్న మధ్యలో గోపీచంద్ ఒక్కసారిగా ఏం జరుగుతుంది అన్నది జనాలకి కూడా అర్థం కాకుండా పోయింది.

అఫ్కోర్స్ ఇదంతా ప్రమోషన్స్ పబ్లిసిటీ స్టంట్ అని తెలిసిన ఇంత వైల్డ్ గా గోపీచంద్ ఎప్పుడు బిహేవ్ చేయలేదు . ఈ క్రమంలోని సుమ ఏదో తలతిక్క ప్రశ్న అడుగుతుందని అందుకే గోపీచంద్ ఇలా పీక నొక్కి పెట్టాడు అంటూ ఫ్యాన్స్ చెబుతున్నారు . మరికొందరు ఇదంతా పబ్లిసిటీ స్టంట్ రా బాబోయ్ ..దీనిని పెద్ద సీరియస్ గా తీసుకోకండి అంటూ లైట్ గా తీసుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news