Moviesఒక‌ప్ప‌టి అందాల హీరోయిన్ గీతాంజ‌లి ఫుల్ డ్రింక‌రా... ఆ ఇద్ద‌రితోనూ ప్రేమాయ‌ణం...

ఒక‌ప్ప‌టి అందాల హీరోయిన్ గీతాంజ‌లి ఫుల్ డ్రింక‌రా… ఆ ఇద్ద‌రితోనూ ప్రేమాయ‌ణం న‌డిపిందా…!

అనేక సినిమాల్లో న‌టించి..త‌న‌కంటూ.. ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్న గీతాంజ‌లి.. య‌వ్వ‌నంలో ఉండ గా.. మ‌ద్యానికి అల‌వాటు ప‌డ్డార‌నే టాక్ ఉంది. ప‌ద్మ‌నాభంతో కొన్నాళ్లు ప్రేమాయ‌ణం కూడా సాగించార‌ని.. త‌ర్వాత‌.. హ‌రినాథ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నార‌నికూడా అంటారు. ఇక‌, ప‌ద్మ‌నాభం గీతాంజ‌లి కాంబినేష‌న్ సూప‌ర్ హిట్ అనే టాక్ ఉన్న విష‌యం తెలిసిందే.

అనేక సినిమాల్లో ఇద్ద‌రూ క‌లిసి న‌టించారు. ప‌ద్మ‌నాభం ఈ క్ర‌మంలోనే గీతాంజ‌లితో ప్రేమ‌లో ప‌డ్డాడ‌ని అంటారు. కానీ.. గీతాంజ‌లి అప్ప‌ట్లో హై ఫై లైఫ్‌ను ఇష్ట‌ప‌డేవారు. అధునాతత‌ స్ట‌యిల్డ్ కారును ఎంత ఖ‌రీదై నా స‌రే కొనేసేవార‌ట‌. ఇలా.. కొని అలా ఏడాది తిరిగే స‌రికి మార్చేసి.. వేరే కారు కొనేవార‌ట‌. ఈ ఖ‌ర్చు భ‌రించేస్థాయి లేక‌..ప‌ద్మ‌నాభం త‌న ప్రేమ‌ను విర‌మించుకున్నార‌ని చెబుతారు.

ఇక‌, హ‌రినాథ్‌ను గీతాంజ‌లి ప్రేమించ‌డం.. కొస‌మెరుపు. హ‌రినాథ్‌.-గీతాంజ‌లి క‌లిసి.. న‌టించిన తొలిసిని మా అన్న‌గారు ఎన్టీఆర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సీతారామ కళ్యాణం. ఈ తొలి సినిమాతోనే హ‌రినాథ్‌ను గీతాంజ‌లి ప్రేమించిందని ఒక‌టాక్ ఉంటే.. త‌ర్వాత ఎప్పుడో ఇద్ద‌రూక‌లిసి న‌టించిన సినిమ‌తో ప్రేమాయ‌ణం ప్రారంభ‌మైంద‌ని కొంద‌రు అంటారు. ఇక‌, గీతాంజ‌లి అప్ప‌ట్లో సావిత్రి జ‌ట్టులో ఉండేద‌ట‌.

సావిత్రితో ఉంటే.. అవ‌కాశాలు వ‌స్తాయ‌నే ఆశ కావొచ్చు. దీంతో సావిత్రితో క‌లిసి క్ల‌బ్బుల‌కు తిరిగేవారు. ఈ క్ర‌మంలోనే ఆమెకు మందు అల‌వాటైంద‌ని ఒక టాక్‌. అయితే.. ఇది జీవితాన్ని మైమ‌రచి పోయే వ‌ర‌కు కాకుండా.. మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. కానీ, గీతాంజ‌లి ఎంత గా మారినా.. ఈ టాక్ మాత్రం ఆమెకు జీవితాంతం కొన‌సాగింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news