Moviesభానుమ‌తిని అలా చూసి ఫిదా అయిపోయిన ఎన్టీఆర్‌... అంత మైమ‌రిపించిందా...!

భానుమ‌తిని అలా చూసి ఫిదా అయిపోయిన ఎన్టీఆర్‌… అంత మైమ‌రిపించిందా…!

అంత‌స్తులు సినిమా. 1965లో వ‌చ్చిన సూప‌ర్ మూవీ. ఇది జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ తీసింది. వి. బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మించారు. వి. మధుసూదన రావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ప్రధాన పాత్రలలో అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి రామకృష్ణ, కృష్ణకుమారి నటించారు, కె. వి. మహదేవన్ సంగీతం స్వరపరచాడు. ఈ చిత్రం 1965 సంవ‌త్స‌రంలో తెలుగు సినిమాలలో ఉత్తమ చలన చిత్రంగా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ పొందింది. ఈ సినిమాలో ధనము, అధికారము గల జమిందారి జీవితాన్ని ఆవిష్క‌రించారు.

అదే స‌మ‌యంలో జ‌మీందారుగా చెలామ‌ణి అవుతూనే.. స‌మాజంలో చేసిన త‌ప్పును క‌ప్పిపుచ్చుకున్న వ్య‌క్తి గా కూడా ఈసినిమా చూపిస్తుంది. అయితే.. ఈ సినిమాలో భానుమ‌తి క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా న‌టించారు. ఈ సిని మాలో చాలా పాటలు సూప‌ర్ హిట్ కొట్టాయి. `నిను వీడ‌ని నీడ‌ను నేనేపాట ఈ సినిమాలోదే. హీరో హీరోయిన్లుగా కృష్ణ‌కుమారి-అక్కినేని న‌టించారు. ఇక‌, హీరోకు చెల్లి పాత్ర‌లో భానుమ‌తి న‌టించింది.

సినిమా అంతా కూడా.. ఫ‌స్ట్ హాఫ్ వ‌ర‌కు .. భానుమ‌తికి పెద్ద‌గా పాత్ర‌లేదు. కానీ, త‌ర్వాత మాత్రం మొత్తం సినిమా అంతా కూడా.. భానుమ‌తి చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమాలో భానుమ‌తి ఎలివేష‌న్ ఎక్కువ‌. కృష్ణ‌కుమారి పాత్ర‌కు ఎలివేష‌న్ తక్కువ‌. ఈ ఉద్దేశంతోనే భానుమ‌తి క్యారెక్ట‌ర్ పాత్ర‌నున‌టించార‌ని అంటా రు. పైగా.. ఆమెకు క్యారెక్ట‌ర్ పాత్రే ఇచ్చినా.. రెండు అదిరిపోయే సాంగ్స్ కూడా చెప్పారు. మొత్తానికి ఈ సినిమాలో విభిన్నంగా భానుమ‌తి న‌టించారు.

ఇక‌, ఈ సినిమాకు జాతీయ అవార్డుల ల‌భించింది. దీంతో వీబీ రాంజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌త్యేకంగా తెలుగు న‌టుల కోసం. ఈ సినిమాను జెమినీ స్టూడియోలో ప్ర‌ద‌ర్శించారు. ఈ సినిమాను అన్న‌గారు ఎన్టీఆర్ కూడా వీక్షించారు. భానుమ‌తి న‌ట‌న‌కు ముగ్దుల‌య్యారు. ఆ త‌ర్వాత‌.. ఎన్టీఆర్‌, భానుమ‌తి కాంబినేష‌న్‌లో రెండు మూడు సినిమాలు రావ‌డం విశేషం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news