Newsఈ గోపీచంద్ మార‌డు.. మార‌తాడ‌న్న ఆశా లేదు... ' రామ‌బాణం '...

ఈ గోపీచంద్ మార‌డు.. మార‌తాడ‌న్న ఆశా లేదు… ‘ రామ‌బాణం ‘ ట్రైల‌ర్‌తోనే రాడ్ దింపేశాడు (వీడియో)

రామబాణం ట్రైలర్ చూస్తేనే పై టైటిల్ సగటు సినిమా పరిజ్ఞానం ఉన్న ఎవరికి అయినా గుర్తుకురాక మానదు. ఎన్ని ఎదురు దెబ్బలు.. ఎన్ని ప్లాపులు ఎదురవుతున్నా గోపీచంద్ మారేలే లేడు. ఇక మారతాడు అన్న ఆశలు కూడా ఎవరికీ కలగటం లేదు. పక్కా కమర్షియల్ పరమ రోటిన్‌ రోడ్డ కొట్టుడు సినిమా. ఇక రామబాణం సినిమా అనగానే ఎక్కడో ? చిన్న ఆశలు చిగురించాయి. అయితే అటువైపు ఉన్నది శ్రీవాస్ అనే మరో రోడ్డ కొట్టుడు రొటీన్ డైరెక్టర్.

ఇక తాజాగా రిలీజ్ అయిన రామబాణం ట్రైలర్ చూస్తే అందరి మబ్బులు, ముసుగులు తొలగిపోయాయి. అటు శ్రీవాస్ మారలేదు.. ఇటు గోపీచంద్ మారలేదు. పరమ రొటీన్ ట్రైలర్‌ను మన మీదకు విసిరి పడేశారు. చూడండి రెడీగా ఉండండి. మరో రొడ్డ కొట్టుడు సినిమా మీకు చూపించేందుకు మీ ముందుకు వస్తున్నాం అంటూ ఒక హింట్ కూడా ఇచ్చి పడేశారు. ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఏమాత్రం ?ఆకట్టుకోలేదు.

ఒక్క కొత్త సీన్ అన్నది కూడా కనపడటం లేదు. మనం ఇప్పటికే ఎన్నో సినిమాలలో చూసి చూసి విసుగెత్తేసిన సీన్లతో ట్రైలర్ నింపేశారు. అసలు ట్రైలర్ ఇంత దారుణంగా ఉంది అంటే.. రేపు రెండున్నర గంటల సినిమాలో పాత సినిమాల‌లో సీన్లు కాపీ పేస్ట్ చేసి వదిలేసి ఉంటారు అన్న సందేహాలు కలుగుతున్నాయి. తూర్పు తిరిగి దేవుడికి దండం పెట్టుకోవడం తప్ప చేసేదేం లేదు. ఈ ట్రైల‌ర్‌పై మీరు కూడా ఓ లుక్కేసి మీరే ఎలా ఉందో చెప్పండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news