Movies' పుష్ప 2 ' లో ఈ హీరోతో సుకుమార్ సినిమాటిక్...

‘ పుష్ప 2 ‘ లో ఈ హీరోతో సుకుమార్ సినిమాటిక్ యూనివ‌ర్స్‌… మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్‌

కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగ‌రాజు సినిమాటిక్ యూనివర్స్ ఇప్పుడు జాతీయస్థాయిలో బాగా పాపులర్ అయింది. ఇప్పుడు తెలుగులోనూ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ స్టైల్‌ను కొందరు దర్శకులు ట్రై చేస్తున్నారు. సుకుమార్ కూడా ఈ సినిమాటిక్ యూనివర్స్ పై ఆసక్తితో ఉన్నాడని… తాను తరకెక్కిస్తున్న పుష్ప 2 సినిమాలో దీనిని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్ – రష్మిక మందన్న‌ జంటగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

తాజాగా అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన వీడియో, పోస్టర్ ఎలాంటి సంచలనాలు సృష్టించాయో తెలిసిందే. పుష్ప సినిమాతో బన్నీని ఐకాన్ స్టార్ ను చేసిన సుకుమార్.. ఈసారి గ్లోబల్ స్టార్ ని చేస్తాడని.. ఇప్పటికే ఈ సినిమాలో విలను భారీ ఎత్తున ఉన్నారని ప్రచారం జరుగుతుంది. సునీల్, ఫాహాద్ ఫాజిల్‌ లాంటి స్టార్స్ ఉండగా ఇప్పుడు ఈ సినిమాకు మరో హీరోతో స్పెషల్ ఎట్రాక్షన్ రానుంది. ఆ హీరో ఎవరో కాదు. విల‌క్ష‌ణ న‌టుడు జగపతిబాబు.

సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమాలో సర్పంచ్ పాత్రలో విలన్ గా మెప్పించిన జగపతిబాబు.. ఇప్పుడు పుష్ప పార్ట్ 2 లోను ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని జగపతిబాబు స్వయంగా తెలిపారు. పుష్ప 2 ఒక ఛాలెంజ్.. నాకు ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం.. తన ముందు సినిమాలో లాగే ఈ సినిమాలో కూడా నాకోసం ఒక బెస్ట్ పాత్రను రాశాడు.. అతడితో పని చేయటానికి తాను ఎప్పుడూ రెడీగా ఉంటానని.. పుష్ప నాకు నచ్చిన సినిమా అంటూ జగపతిబాబు చెప్పుకొచ్చాడు.

ఇక విశ్వస‌నీయ‌ వర్గాల సమాచారం ప్రకారం రంగస్థలం సినిమాలో జగపతిబాబు సర్పంచ్ ఫణింద్ర భూపతిగా నటించాడు. చివర్లో రామ్ చరణ్ పామును కొట్టి చంపినట్టు చూపించారు. ఆ సర్పంచ్ పాత్ర ఇప్పుడు పుష్ప 2లో కూడా కంటిన్యూ అవుతుందట. ఈ పాత్ర‌ను సుకుమార్‌ చాలా పగడ్బందీగా రాసుకున్నాడని… ఈ పాత్ర సినిమాటిక్ యూనివ‌ర్సిల్‌ స్టైల్ లో ఉంటుందని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news