Moviesఆక‌లితో ఉన్న పులి... సింహాన్ని వేటాడుతోంది... ' ఏజెంట్ ' ట్రైల‌ర్...

ఆక‌లితో ఉన్న పులి… సింహాన్ని వేటాడుతోంది… ‘ ఏజెంట్ ‘ ట్రైల‌ర్ ( వీడియో)

అక్కినేని వారి న‌వ మ‌న్మ‌థుడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అఖిల్ అక్కినేని హీరో లేటెస్ట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఏజెండ్‌. భారీ చిత్రాల ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాకు అనిల్ సుంక‌ర నిర్మాత‌. దాదాపు మూడేళ్లుగా షూటింగ్ జ‌రుపుకున్న ఈ సినిమా రు. 80 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కింది.

స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఏజెంట్‌లో సాక్షి వైద్య హీరోయిన్. ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్ల వేడి కూడా మొద‌లైంది. సినిమాకు ఏరియాల వారీగా ప్రి రిలీజ్ బిజినెస్ కూడా అఖిల్ కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ రేంజ్‌లో న‌డుస్తోంది. త‌మిళ‌ హిప్ హాప్ తమీజా సంగీతం అందించాడు. ఈ నెల 28న పాన్ ఇండియా లెవ‌ల్లో ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ రోజు రిలీజ్ అయిన ట్రైల‌ర్ విజువ‌ల్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అన్న ప‌దం కూడా స‌రిపోయేలా లేదు.

ఓ స్పై ఏజెంట్ యాక్ష‌న్‌లోకి దిగితే ఎలా ఉంటుందో అచ్చం ట్రైల‌ర్ అలాగే ఉంది. ఆక‌లితో ఉన్న పులి… సింహాన్ని వేటాడడానికి వ‌స్తోంది… ప్ర‌తి సెక‌న్‌ గూస్ బంప్సే అన్న‌ట్టుగా ఉంది. సాక్షి వైద్య అందాలు, స్టైలీష్ యాక్ష‌న్ ట్రైల‌ర్‌కే హైలెట్‌. ఓవ‌రాల్‌గా సురేంద‌ర్‌రెడ్డి మార్క్ స్టైలీష్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ చూడ‌బోతున్నాం అని ట్రైల‌ర్‌తో క్లారిటీ వ‌చ్చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news