MoviesRRR ఆస్కార్ స్పెషల్ : అభిమానుల కోరిక తీర్చబోతున్న రాజమౌళి..తెలుగు చరిత్రలోనే...

RRR ఆస్కార్ స్పెషల్ : అభిమానుల కోరిక తీర్చబోతున్న రాజమౌళి..తెలుగు చరిత్రలోనే మరో సంచలనం..!!

హమ్మయ్య ఫైనల్లీ 130 కోట్ల మంది జనాభా వెయిట్ చేసిన ఆస్కార్ అవార్డు వరించింది. ఇండియన్ ఫిలిం హిస్టరీ లోనే ఫస్ట్ టైం ఆస్కార్ అవార్డు అందుకుంది ఆర్ఆర్ఆర్ సినిమా . దర్శకధీరుడు రాజమౌళి సినిమా కొద్ది గంటలకు ముందే ఆస్కార్ అవార్డ్ ని చేత పట్టుకుంది . ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు లభించింది . రాహుల్, కాలభైరవలతో పాటు పాట లిరిక్స్ రాసిన చంద్రబోస్ పాట ట్య్యున్ చేసిన కీరవాణి పేర్లు సోషల్ మీడియాలో రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయి.

అంతేకాదు ఇప్పుడు ప్రతి ఒక్కరు కాలర్ ట్యూన్ గా ఆర్ఆర్ఆర్ లోని నాటూ నాతు పాట ను పెట్టుకుంటున్నారు . కాగా ఈ క్రమంలోని అభిమానులు రాజమౌళి కోరికను తీర్చబోతున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. గతంలో చెప్పినట్లే ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు విన్ అయితే రాజమౌళి ఆర్ఆర్ఆర్ 2 సినిమాను తెరకెక్కిస్తానని అభిమానులకు మాటిచ్చారు. అదే విధంగా రాజమౌళి త్వరలోనే ఆర్ఆర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ 2 పై త్వరలోనే ఓ అఫీషియల్ ప్రకటన ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది . మనకు తెలిసిందే ప్రెసెంట్ రాజమౌళి – మహేష్ బాబు కోసం మంచి కథను రెడీ చేసారు .

త్వరలోనే ఈ సినిమాను చేయబోతున్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే బాహుబలి 3 ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది . అయితే తాజాగా సమాచారం ప్రకారం బాహుబలి 3 సినిమాను పోస్ట్ పోన్ చూస్తున్నట్లు తెలిసింది . ఆ ప్లేస్లోకి ఆర్ ఆర్ ఆర్ 2రాబోతున్నట్లు సినీ వర్గాలనుంచి సమాచారం అందుతుంది . దీనిపై త్వరలోనే రాజమౌళి అఫీషియల్ ప్రకటన కూడా చేయబోతున్నాడట . ప్రజెంట్ ఆర్ ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు అందుకున్న శుభ సందర్భంగా టీమ్ అందరికీ బిగ్ పార్టీ ఇవ్వబోతున్నాడు రాజమౌళి అంటూ తెలుస్తుంది . ఆ పార్టీలోని ఆర్ఆర్ఆర్ 2 గురించి చర్చించి అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాడట రాజమౌళి . ఏది ఏమైనా సరే తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే ఫస్ట్ టైం తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డు సంపాదించి పెట్టడం రాజమౌళికే సాధ్యమైంది . దీంతో శభాష్ రాజమౌళి అంటూ పలువురు విష్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news