Moviesసినిమాలు తీయ్యడం అయినా ఆపేస్తా.. అతనితో మూవీ చేయను..రాజమౌళికి కోపం తెప్పించిన...

సినిమాలు తీయ్యడం అయినా ఆపేస్తా.. అతనితో మూవీ చేయను..రాజమౌళికి కోపం తెప్పించిన స్టార్ హీరో..!!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే . మన తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు పాకేలా చేసిన రాజమౌళికి ఎన్నిసార్లు హ్యాట్సాఫ్ చెప్పినా ఎన్నిసార్లు దండాలు పెట్టిన అది తక్కువే అవుతుంది అంటున్నారు అభిమానులు . మరీ ముఖ్యంగా బాహుబలి సినిమాతో తన పేరుని ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయేలా చేసుకున్నా రాజమౌళి ..రీసెంట్గా తీసిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ నామినేషన్ లో నిలిచాడు .

కచ్చితంగా ఆస్కార్ కొడుతుంది ఆర్ఆర్ఆర్ సినిమా అంటూ తెలుగు జనాలు ఇండియన్ సినిమా ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంత పెద్ద స్టార్ స్టేటస్ సంపాదించుకున్న డైరెక్టర్ మాత్రం ఓ హీరోతో సినిమా చేయను అంటూ ముఖానే చెప్పేశాడు . ప్రస్తుతం అవే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో రాజమౌళి ఆచితూచి నిర్ణయాలు తీసుకునే వాడు.. అఫ్ కోర్స్ ఇప్పటికీ అలానే తీసుకుంటున్నారు .

అయితే రాజమౌళికి ఉన్న క్రేజ్ దృష్ట్యా వరుసగా ఫ్లాప్స్ అందుకుంటున్న స్టార్ హీరో కొడుకుని ఆయన డైరెక్షన్లో సినిమాలో చేయమని స్టార్ హీరో స్పెషల్ గా రిక్వెస్ట్ చేశారట. అంతేకాదు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తామంటూ డబ్బుని ఎరగా వేశారట . అయితే డబ్బుకి ఏమాత్రం లొంగని రాజమౌళి.. ” మీ కొడుకుకి హీరో లక్షణాలు లేవు.. హీరో అయ్యే ఛాన్స్ లేదు.. చేసిన సినిమాలన్నీ చూసిన తరువాతనే ఇలా చెప్పుతున్నా.. అలాంటి అబ్బాయితో నేను సినిమా చేయను” అంటూ చెప్పుకొచ్చారట .

అంతేకాదు ఆ హీరో తండ్రి కోపం వచ్చి “ఇండస్ట్రీలో నువ్వు డైరెక్టర్ గా ఎలా ఎదుగుతావో నేను చూస్తాను” అంటూ వార్న్ చేశారట . దీంతో కోపం వచ్చి జక్కన్న..” సినిమాలైనా ఆపేస్తాను కానీ నీ కొడుకుతో మాత్రం సినిమా చేయను ” అంటూ ఓపెన్ గానే చెప్పేసాడట . దీంతో రాజమౌళి అప్పట్లో చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో నిలిచిన కారణంగా వైరల్ అవుతున్నాయి . కాగా రాజమౌళి త్వరలోనే మహేష్ బాబుతో కలిసి మరో ప్రతిష్టాత్మకమైన సినిమా తీయ్యబోతున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news