Moviesథ‌మ‌న్‌కు.. ఉ** పడిపోయేలా చేసిన తెలుగు హీరో ఫ్యాన్స్‌… బుద్దుంటే ఇంకోసారి...

థ‌మ‌న్‌కు.. ఉ** పడిపోయేలా చేసిన తెలుగు హీరో ఫ్యాన్స్‌… బుద్దుంటే ఇంకోసారి అలా చేయడు…!!

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో హీరోల అభిమానుల మ‌ధ్య ఒక్కోసారి సోష‌ల్ మీడియా వేదిక‌గా పెద్ద యుద్ధాలే న‌డుస్తున్నాయి. హీరోల అభిమానుల‌కు కోపం వ‌స్తే అటు వైపు ఎవ‌రు ఉన్నార‌న్న‌ది చూడ‌కుండా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో మ‌హేష్‌బాబు అభిమానులు, టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్‌ను టార్గెట్‌గా చేసుకుని సోష‌ల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. అస‌లు థ‌మ‌న్‌కు, మ‌హేష్‌బాబు అభిమానుల‌కు మ‌ధ్య ఎక్క‌డ చెడింది ? ఏం జ‌రిగిందో అంతుప‌ట్ట‌డం లేదు.

ప్ర‌స్తుతం మ‌హేష్‌బాబు.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 28వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు థ‌మ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. థ‌మ‌న్ ఇటీవ‌ల ఫుల్‌స్వింగ్‌లో ఉన్నాడు. పైగా సంక్రాంతికి వ‌చ్చిన బాల‌య్య వీర‌సింహారెడ్డి సినిమా పాట‌ల‌తో పాటు ఆర్ ఆర్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో చూశాం. పైగా ఈ సినిమా విజ‌యంలో థ‌మ‌న్ మ్యూజిక్ ఎంతో హెల్ఫ్ అయ్యింది.

అంత ఫామ్‌లో ఉన్న థ‌మ‌న్ మ‌హేష్ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నాడంటే మ‌హేష్ అభిమానులు హ్యాపీ ఫీల‌వ్వాలి.. కానీ వాళ్లంతా థ‌మ‌న్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు. అయితే మ‌హేష్ ఫ్యాన్స్ కోపానికి వేరే కార‌ణం ఉంది. థ‌మ‌న్ బ‌న్నీ అల వైకుంఠ‌పురంలో ఇండ‌స్ట్రీ హిట్‌గా నిల‌వ‌డంలో స‌గం పాత్ర పోషించారు. ఆ సినిమాకు థ‌మ‌న్‌కు ఏకంగా జాతీయ అవార్డు ద‌క్కింది.

ఇక బాల‌య్య సినిమాలు అంటే ప్రాణ‌మే పెట్టేస్తున్నాడు. అదే మ‌హేష్ సినిమాకు వ‌చ్చేస‌రికి అంత క‌ష్ట‌ప‌డ‌డం లేద‌న్న‌దే వారి ఆరోప‌ణ‌. స‌ర్కారు వారి పాట సాంగ్స్‌, ఆర్ ఆర్ తేలిపోయాయి. ఇప్పుడు కూడా థ‌మ‌న్ బిజీ షెడ్యూల్లో ఉన్నాడ‌ని.. అల రేంజ్ మ్యూజిక్ ఇవ్వ‌క‌పోతే వేస్ట్ అన్న‌దే వారి ఆరోప‌ణ‌. అందుకే గ‌త కొద్ది గంట‌ల నుంచి మ‌హేష్ ఫ్యాన్స్ అంతా క‌ట్ట‌గ‌ట్టుకుని మ‌రీ థ‌మ‌న్‌పై నెగ‌టివ్ ట్రెండ్ చేస్తున్నారు. పైగా వీరు #RemoveThamanFromSSMB28 అంటూ వారు చేస్తున్న ట్రెండ్ టాప్‌లో వైర‌ల్ అవుతోంది.

ఒక్క‌సారిగా థ‌మ‌న్‌పై ఈ నెగ‌టివ్ ట్రెండ్‌కు కార‌ణం ఏంటో తెలియ‌ట్లేదు. అయితే అటు థ‌మ‌న్ సైడ్ నుంచి కూడా దీనికి ఘాటుగా కౌంట‌ర్ వ‌చ్చేసింది. త‌న‌పై పిల్ల‌లు చేస్తోన్న నెగ‌టివ్ ట్రెండ్‌కు రెస్ట్ ఇన్ పీస్ అంటూ పోస్ట్ పెట్టాడు. మ‌రి ఈ వివాదం ఎటు మ‌లుపులు తిరుగుతుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news