Moviesఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు..రియల్ సంక్రాంతి విన్నర్ ఎవరు.."వీరయ్య"నా.."వీర సింహా"నా..?

ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు..రియల్ సంక్రాంతి విన్నర్ ఎవరు..”వీరయ్య”నా..”వీర సింహా”నా..?

హమ్మయ్య.. ఎట్టకేలకు బాక్స్ ఆఫీస్ వద్ద రెండు బడా సినిమాలు కూల్ గా రిలీజ్ అయిపోయాయి. మనకు తెలిసిందే ఓ బడా హీరో సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది ..అంటే ఫ్యాన్స్ ఎలాంటి హంగామా చేస్తారో ..ఎంత ఎంజాయ్ చేస్తారో.. మరి అలాంటిది .. ఇద్దరు టాప్ హీరోల సినిమాలు ఒకే మూమెంట్లో రిలీజ్ అవుతుంటే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ మామూలుగా ఉండదు. సినిమా రిలీజ్ అయ్యే కొన్ని నెలల ముందు నుంచి సోషల్ మీడియాలో వీరసింహారెడ్డి – వాల్తేరు వీరయ్య సినిమాలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.. ప్లస్లు , మైనస్లు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి.

కాగా ఎట్టకేలకు 48 గంటల్లోనే వీరసింహారెడ్డి – వాల్తేరు వీరయ్య సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయ్యి ..పాజిటివ్ టాక్ ను దక్కించుకున్నాయి . అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మరో ఇంట్రెస్టింగ్ వార్ వైరల్ గా మారింది . రియల్ సంక్రాంతి విన్నర్ ఎవరు అంటూ ఓ పోల్ నడుస్తుంది . ఈ క్రమంలోనే చాలామంది.. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాకి ఓట్లు వేయడం గమనార్హం. అంతేకాదు వాల్తేరు వీరయ్య సినిమా పరంగా బాగున్నప్పటికీ ..ప్రజలకు రీచ్ అయ్యే పర్ఫామెన్స్ అక్కడ లేదని ..సినిమా మొత్తానికి కర్త – కర్మ – క్రియ మెగాస్టార్ గా ఉన్నాడని ..

బాలయ్య వీర సింహారెడ్డి విషయంకి వచ్చేసరికి పొలిటికల్ పవర్, ఫామిలీ సెంటిమెంట్ ,మాస్ డైలాగ్స్ ,హై యాక్షన్ సీన్స్ ,పవర్ఫుల్ ఫైట్ మరీ ముఖ్యంగా అన్నిటిని మిక్స్ చేస్తూ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి హైలెట్ గా మారింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో పలువురు నందమూరి ఫ్యాన్స్ వీరసింహారెడ్డి సినిమాలో నటించిన బాలయ్య సంక్రాంతి రియల్ హీరో అంటుంటే ..కాదు కాదు వాల్తేరు వీరయ్య సినిమాలో వీరయ్య గా నటించిన చిరంజీవిని రియల్ సంక్రాంతి విన్నర్ అంటూ పోటాపోటీగా కామెంట్స్ పెడుతున్నారు , మరి మీ దృష్టిలో ఈ సంక్రాంతి విన్నర్ ఎవరు? వీరయ్యనా..? లేక వీర సింహానా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news