Moviesవీరసింహారెడ్డి ఫస్ట్ డే కలెక్షన్స్ : బాలయ్య కెరీర్లోనే టాప్.. అఖండ...

వీరసింహారెడ్డి ఫస్ట్ డే కలెక్షన్స్ : బాలయ్య కెరీర్లోనే టాప్.. అఖండ సినిమా కు అమ్మ మొగుడే..ఇదేం అరాచకం సామీ..!!

టాలీవుడ్ నట సింహం నందమూరి బాలయ్య హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం వీర సింహారెడ్డి. క్రాక్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని .. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించారు. అంతేకాదు వీళ్ళిద్దరి కాంబోలో సినిమా వస్తుంది అని తెలియగానే నందమూరి ఫ్యాన్స్ లో ఫుల్ తెలియని జోష్ ఏర్పడింది . వాళ్లని ఏం మాత్రం డిసప్పాయింట్ చేయకుండా.. గోపీచంద్ మలినేని నందమూరి ఫ్యాన్స్ ని ఫుల్ రేంజ్ లో సాటిస్ఫై చేశారు .

మరీ ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య నోటి నుంచి వచ్చిన ఒక్కొక్క పవర్ఫుల్ పొలిటికల్ పంచ్ డైలాగ్ తగలాల్సిన వాటికి ఘాటుగా తగిలింది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి . అంతేకాదు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సింగిల్ హ్యాండ్ తో బాలయ్య సినిమాను పైకి లేపాడు . సినిమాలో ఇద్దరు గ్లామరస్ బ్యూటీ లు ఉన్నా సరే ..అందరి కళ్ళు బాలయ్య పైనే పడ్డాయి ..అంటే ఈ సినిమాలో బాలయ్య పెర్ఫార్మన్స్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు .

అంతే కాదు కలెక్షన్స్ పరంగా కూడా బాలయ్య వీర సింహారెడ్డి ఓ రేంజ్ లో దూసుకుపోతుంది . ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య వీర సింహారెడ్డి మొదటిరోజు కలెక్షన్స్ ఏకంగా 32 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. బాలయ్య కెరియర్ లోని ఇది ఓ సంచలన రికార్డ్ అని చెప్పాలి . అంతేకాదు బాలయ్య సినిమాకు పోటీగా వచ్చిన వారీసు, తునివు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తేలిపోయాయి . వారిసు సినిమా 26.5 కోట్లు కలెక్ట్ చేస్తే ..తునివు సినిమా 26 కోట్లు కలెక్ట్ చేసింది . అంతేకాదు మరో రెండు రోజుల్లోనే వీర సిమ్హా రెడ్డి సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోతుంది అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news