Moviesమంచం మీద కదలలేని పోజీషన్ లో పునర్నవి భూపాలం..? ఫ్యాన్స్ కన్నీరు..!!

మంచం మీద కదలలేని పోజీషన్ లో పునర్నవి భూపాలం..? ఫ్యాన్స్ కన్నీరు..!!

యంగ్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న పునర్నవి భూపాలం గురించి పెద్దగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఉయ్యాల జంపాల సినిమాలో సెకండ్ హీరోయిన్గా పునర్నవి భూపాలం నటించిన మెప్పించింది . ఈ సినిమాలో మొదటి హీరోయిన్గా నటించిన చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటూ చేసిన కామెడీ సీన్స్ పండించిన లవ్ ట్రాక్ జనాలను విపరీతంగా ఆకట్టుకున్నింది. ఈ సినిమాతోనే పునర్నవి భూపాలం పేరు ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో ట్రెండ్ అయింది .

అయితే ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ పెద్దగా ఆమెకు కలిసి రాలేదు . ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తోటి కంటెస్టెంట్ రాహుల్ సిప్లిగంజ్ తో తెగ రాసేసుకుని పూసేసుకుని తిరిగింది . అంతే కాదు బిగ్ బాస్ సీజన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా పలు ఛానల్స్ కి కలిసి జంటగా ఇంటర్వ్యూలు ఇస్తూ అటెండ్ అవ్వడంతో త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుంది అంటూ అంతా ఊహించుకున్నారు . సీన్ కట్ చేస్తే.. ఒకవైపు పునర్నవి భూపాలం.. మరోవైపు రాహుల్ తమ పనులతో బిజీ అయిపోయారు .

కాగా రీసెంట్గా న్యూ ఇయర్ సందర్భంగా పునర్నవి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ అభిమానులకు కన్నీరు తెప్పిస్తుంది . మంచంపై కదలలేని పొజిషన్లో ఉన్న పున్ను ఫొటోస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . అందుతున్న సమాచారం ప్రకారం పునర్నవి భూపాలం ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతుంది. అంతేకాదు ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టంగా ఉన్నట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోనే పునర్నవి భూపాలం ఫేస్ బాగా చిక్కిపోయి డల్ గా నిరసించిపోయి కనిపించింది.

ఒకప్పుడు చాలా ఫ్రెష్ గా గ్లోగా కనిపించిన పునర్నవి భూపాలం.. ఇప్పుడు ఎటు కదల లేకుండా మంచం మీద ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . దీంతో త్వరగా ఆమె పూర్తి ఆరోగ్యవంతురాలుగా కోలుకొని మళ్ళీ అభిమానులతో యధావిధిగా చిట్ చాట్ చేయాలని ఫాన్స్ కోరుకుంటున్నారు . ఏది ఏమైనా సరే ఈ మధ్యకాలంలో అందాల ముద్దుగుమ్మలు అందరూ వరుసగా ఇలా జబ్బులు బారిన పడుతుండడంతో సినీ ఇండస్ట్రీలో కొత్త డౌట్లు మొదలవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news