Moviesచిరు VS బాలయ్య: బెస్ట్ డ్యాన్సర్ ఎవరో తెలుసా..? శృతి ఆన్సర్...

చిరు VS బాలయ్య: బెస్ట్ డ్యాన్సర్ ఎవరో తెలుసా..? శృతి ఆన్సర్ కి ఫ్యాన్స్ షాక్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు. కానీ వాళ్లలో ప్రధానంగా టాలీవుడ్ లో స్టార్స్ గా వినిపించే పేర్లు చిరంజీవి – బాలకృష్ణ . టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోస్ అయిన వీళ్లు ఏజ్ కు మించిన రోల్స్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు . ఆ విషయంలో ఇద్దరికీ ఇద్దరే.. ఎవరు తీసిపోరు అభిమానుల కోసం ఏదైనా చేయగలిగే సత్తా ఉన్న స్టార్స్ వీరు అని చెప్పుకోవడంలో సందేహం లేదు . కాగా ఈ సంక్రాంతి కానుకగా బాక్స్ ఆఫీస్ వద్ద టఫెస్ట్ ఫైట్ నెలకొంది .

వీర సింహారెడ్డి పేరుతో బాలయ్య.. వాల్తేరు వీరయ్య అనే సినిమాతో చిరంజీవి.. బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారు . జనవరి 12న గోపీచంద్ డైరెక్షన్ లో బాలయ్య హీరోగా తెరకెక్కిన సినిమా వీరసింహారెడ్డి గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . అంతేకాదు ఆ సినిమా రిలీజ్ అయిన 24 గంటల లోపే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన బాబి డైరెక్షన్లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య కూడా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాల కారణంగా సోషల్ మీడియాలో చిరంజీవి వ్శ్ బాలయ్య అంటూ సరికొత్త వార్ ఇంట్రెస్టింగ్గా మారింది.

ఈ ఇద్దరి సినిమాల్లో కామన్ గా ఉన్న ఫ్యాక్టర్ హీరోయిన్. రెండు సినిమాలలో హీరోయిన్గా నటిస్తుంది శృతిహాసన్. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూ కి అటెండ్ అయిన శృతిహాసన్ చిరంజీవితో డాన్స్ క్ష్టమా..? బాలయ్యతో డాన్స్ కష్టమా..? ఇద్దరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ..ఎలా ఉందన్న ప్రశ్న ఎదురయింది . ఇదే క్రమంలో శృతిహాసన్ మాట్లాడుతూ.. ఏ ఫాన్స్ ని హర్ట్ చేయకుండా కూల్ గా ఆన్సర్ ఇచ్చింది . “ఇద్దరిలో వేరువేరు జోనర్స్ ఉన్నాయి. మాస్ స్టెప్ వేయడంలో బాలయ్య తోపు ..క్లాస్ మాస్క్ మిక్స్ చేసి కొట్టడంలో చిరంజీవి కేక “అంటూ తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చి ఇద్దరికీ ఈక్వల్గా ఓటేసింది . అయితే మీ దృష్టిలో ఎవరు ఇండస్ట్రీలో బెస్ట్ డాన్సర్ అనుకుంటున్నారు చిరంజీవినా..? బాలకృష్ణ నా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news