Moviesఆ హీరోయిన్ కల నెరవేర్చబోతున్న ఎన్టీఆర్..ఎవ్వరికి దక్కని గోల్డెన్ ఛాన్స్..!!

ఆ హీరోయిన్ కల నెరవేర్చబోతున్న ఎన్టీఆర్..ఎవ్వరికి దక్కని గోల్డెన్ ఛాన్స్..!!

ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నా వార్తలలో ఎన్టీఆర్ 30 సినిమా వార్త కూడా ఒకటి . అప్పుడెప్పుడో ఆర్ఆర్ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న తారక్..నెక్స్ట్ సినిమాపై ఎక్కువ కాన్ సెంట్రేషన్ చేయడం లేదన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆచార్య సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్న కొరటాల శివకు అవకాశం ఇవ్వడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఏ మాత్రం నచ్చడం లేదు. అయితే హిట్ డైరెక్టర్ తో కాదు ప్లాప్ డైరెక్టర్ తో కూడా హిట్ కొట్టే సత్త ఉన్న ఇండస్ట్రీ హీరో ఎన్టీఆర్ అంటూ పలువురు నందమూరి ఫ్యాన్స్ ఆయనను సపోర్ట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ థర్టీ సినిమాకి హ్యూజ్ బజ్ ఏర్పడింది. న్యూ ఇయర్ సంధర్భంగా ఎన్టీఆర్ థర్టీ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటనను రిలీజ్ చేశారు చిత్ర మేకర్స్. ఈ క్రమంలోనే ఫిబ్రవరి లో ఎన్టీఆర్ థర్టీ షూటింగ్ లాంఛనంగా ప్రారంభం కాబోతుందని ..ఆ తరువాత వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న 2024 ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పుకొచ్చారు . కాగా మొదటి నుంచి ఎన్టీఆర్ 30 సినిమాలో హీరోయిన్గా ఎవరు అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది . మొదటగా అలియా భట్ అనుకున్న జనాలు.. ఆ తర్వాత ఆమె ప్రెగ్నెన్సీ తో ఈ సినిమా రిజెక్ట్ చేసింది. ఇక తర్వాత ఆమె స్థానంలోకి ఎంతోమంది ముద్దుగుమ్మలు వచ్చారు .

ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ అంటూ మొదటి నుంచి ప్రచారం జరిగినా కొన్ని బ్యాడ్ సెంటిమెంట్స్ కారణంగా జాంవీ కపూర్ ఈ ప్రాజెక్టును వదులుకున్నట్లు తెలుస్తుంది . కాగా ఫైనల్ గా కొరటాల ఇద్దరు హాట్ బ్యూటీస్ ని ఎన్టీఆర్ పక్కన నటించడానికి ఒప్పించినట్లు ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న దీపిక పదుకొనే ..ఈ సినిమాలో మొదటి హీరోయిన్గా నటిస్తుందట . అంతేకాదు ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్న కూడా సెలెక్ట్ చేసినట్లు ఫైనల్ కన్ఫర్మేషన్ తెలుస్తుంది .

గతంలో ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ..” ఇండస్ట్రీలో తనకి ఇష్టమైన హీరోలు ఎన్టీఆర్ – – మహేష్ బాబు అని .. వాళ్లతో ఎలాగైనా సినిమాలో నటించాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే మొదటి కోరికను తీర్చేసుకున్న రష్మిక.. ప్రజెంట్ రెండో కోరికొని తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ప్రజెంట్ ఫుల్ కాంట్రవర్షీయల్ లో ఇరుక్కున్న రష్మిక మందనకు ఎన్టీఆర్ పక్కన నటించే అవకాశం దక్కితే అది నిజంగా గోల్డెన్ ఛాన్స్ అని అంటున్నారు సినీ విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news