Moviesబర్త డే నాడు మనసులోని మాటను బయటపెట్టిన శృతి హాసన్.. పుట్టినరోజు...

బర్త డే నాడు మనసులోని మాటను బయటపెట్టిన శృతి హాసన్.. పుట్టినరోజు కోరిక అదేనట.!!

అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ పుట్టినరోజు నేడు , మల్టీ టాలెంటెడ్ లోకనాయకుడిగా గుర్తింపు సంపాదించుకున్న కమలహాసన్ ముద్దుల కూతురే శృతి హాసన్. నాన్న పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ .. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ తెలుగు హిందీ తమిళ జనాలను ఆకట్టుకుంది . అంతే కాదు శృతిహాసన్ లోని స్పెషల్ టాలెంట్ సింగింగ్. అమ్మడు ఎలాంటి పాటైనా సరే అవలీలగా పాడేస్తుంది.

మరీ ముఖ్యంగా ఉన్నది ఉన్నట్టు ముఖానే మాట్లాడే హీరోయిన్ శృతిహాసన్ . బాయ్ ఫ్రెండ్స్ ని ఎక్కువుగా మార్చడంతో సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతున్న శృతి హాసన్.. రీసెంట్గా తన పుట్టినరోజు సందర్భంగా మేకప్ లెస్ ఫొటోస్ ని అభిమానులతో షేర్ చేస్తూ అభిమానులకు కొత్త ఫీలింగ్ ఇచ్చింది. “కాగా పుట్టినరోజు నాడు ఎవరైనా సరే క్యాండిల్స్ ని ఊదుతూ తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటారు”.


“అదేవిధంగా నేను మీరు ఏ కోరికలు అయితే కోరుకుంటున్నారో అవన్ని నెరవేరాలని నేను కోరుకుంటున్నాను . నా బర్త్ డే విష్ అదే అంటూ అభిమానుల కోసం స్పెషల్గా నోట్ చేసింది శృతిహాసన్ “. దీంతో సోషల్ మీడియాలో శృతిహాసన్ మేకప్ లెస్ ఫొటోస్ తో పాటు బర్త డే పిక్స్, రేర్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి .

కాగా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన రెండు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో హీరోయిన్గా నటించిన శృతిహాసన్ ..రెండు సినిమాలు హిట్ అయినా సరే ఇప్పటివరకు మరో సినిమాకు కమిట్ అవలేదు ఈ ముద్దుగుమ్మ . అంతేకాదు రెండు సినిమాలు హిట్ అవ్వడం వల్ల రెమ్యూనరేషన్ భారిగా పెంచేసింది . దాదాపు శృతిహాసన్ ఇప్పుడు ఒక్కో సినిమాకు ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news