Moviesగెట్ రెడీ.. గుడ్లు, రాళ్లు కూడా విసురుతారు..రష్మికపై కిచ్చా సుదీప్ దారుణమైన...

గెట్ రెడీ.. గుడ్లు, రాళ్లు కూడా విసురుతారు..రష్మికపై కిచ్చా సుదీప్ దారుణమైన కామెంట్స్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి ప్రైవసీ అనేది కరువైపోయింది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుందో అందరికీ తెలిసిందే. కాంతారా డైరెక్టర్ రిషిబ్ శెట్టి.. నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్న మధ్య సోషల్ మీడియాలో వార్ రోజు రోజుకి తీవ్రస్థాయిలో పెరిగిపోతుంది .

అప్పుడెప్పుడో ఆయన డైరెక్షన్లో కిర్రాక్ అనే సినిమాలో నటించి ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయిన రష్మిక.. ఆయన గారికి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వలేదని ..అవమానించిందని కన్నడ ప్రజలు ఆమెపై మండిపడుతున్నారు . అంతేకాదు సొంత ఇండస్ట్రీనే రష్మిక మందన్నాను బ్యాన్ చేసే విధంగా ప్లాన్ చేయడంతో రష్మిక మందన్నా పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . కాగా గత కొంతకాలంగా రష్మిక మందన పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై కన్నడ నటుడు కిచ్చా సుదీప్ స్పందించారు.

” ఒకప్పటిలా ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు గౌరవం దక్కడం లేదు.. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ న్యూస్ నిజమో ఏ న్యూస్ అబద్ధమో అర్థం కావడం లేదు. ట్రోలింగ్ అన్నది ఎక్కువగా ఉంటుంది . ఒకప్పుడు పూలమాలలు బొకేలు ఇచ్చి సత్కరించేవాళ్లు..అది కాస్త రూమర్స్ మారి స్టార్స్ పరువు తీసేస్తుంది..ఈ క్రమంలోనే స్టార్ సెలబ్రిటీలు త్వరలోనే గుడ్లు రాళ్లు కూడా విస్తరించుకునేందుకు సిద్ధంగా ఉండాలి ..అలాంటి రూమర్స్ నుండి మనల్ని మనం కాపాడుకోవాలి ” అంటూ రష్మిక మందన ఇష్యూ పై పరోక్షకంగా స్పందించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాడు కన్నడ నటుడు కిచ్చా సుదీప్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news