Newsఫిబ్రవరిలో నిశ్చితార్ధం..మార్చిలో పెళ్లి..శర్వానంద్ కి పెళ్లి కుదిరిపోయిందోచ్.. అమ్మాయి స్టార్ హీరో...

ఫిబ్రవరిలో నిశ్చితార్ధం..మార్చిలో పెళ్లి..శర్వానంద్ కి పెళ్లి కుదిరిపోయిందోచ్.. అమ్మాయి స్టార్ హీరో బంధువే..!?

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న టాలీవుడ్ స్టార్ హీరో శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నాడా..? అంటే అవునని అంటున్నాయి సినీ వర్గాలు . కాగా ఇప్పటికీ 38 ఏళ్లు వయసు వచ్చిన పెళ్లి కాలేదంటూ సోషల్ మీడియాలో శర్వానంద్ ని ఏకి పారేస్తున్నారు . ప్రభాస్కు, సల్మాన్ ఖాన్ కు ట్యాగ్ చేస్తూ నువ్వు కూడా పెళ్లి కాని ప్రసాద్ గా మిగిలిపోతావ్ అంటూ దారుణమైన కామెంట్స్ చేసే వాళ్ళు .

కాగా అలాంటి కామెంట్స్ కు.. రూమర్స్ కు .. చెక్ పెడుతూ శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది . టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న శర్వానంద్ అమెరికాలో జాబ్ చేసే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ని నిపెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది . ఆ అమ్మాయి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వధువుగా తెలుస్తుంది. అంతేకాదు ప్రజెంట్ వర్క్ ఫ్రం హోం కారణంగా ఇండియాలోనే ఉంటూ తన వర్క్ చేసుకుంటుందట.

ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కి దూరపు చుట్టమైన ఓ ఫ్రెండ్ కారణంగా ఈ సంబంధం చరణ్.. శర్వానంద్ కి ఫిక్స్ చేశాడనే క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు ఫిబ్రవరి మొదటి వారంలో వీళ్ళ నిశ్చితార్ధం..మార్చిలో పెళ్లి జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇన్నాళ్లు పెళ్లి పేరు చెప్పితే భయపడిపోయే శర్వానంద్.. ఫాన్స్ ఈ న్యూస్ తో ఫుల్ ఖుషి అవుతున్నారు . మొత్తంగా 2023 శర్వానంద్ కు బాగా కలిసి రాబోతుంది అందుకే ఓ ఇంటివాడు కాబోతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news