Moviesతమన్నా జాతకం ఇంత ఘోరమా.. ఇంతమంది స్టార్స్ ను ముంచేసిందా... ?

తమన్నా జాతకం ఇంత ఘోరమా.. ఇంతమంది స్టార్స్ ను ముంచేసిందా… ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపుగా 18 సంవత్సరాల పాటు కెరీర్ ను కొనసాగించిన హీరోయిన్లు చాలా తక్కువ మంది అనే సంగతి తెలిసిందే. ఆ హీరోయిన్లలో తమన్నా ఒకరు కాగా స్టార్ హీరోలతో తమన్నా నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కొన్ని సినిమాలు సక్సెస్ సాధించినా తమన్నా వల్ల ఆ సినిమాలు సక్సెస్ సాధించాయని ఎవరూ భావించరు. ఎక్కువమంది స్టార్ హీరోలకు తమన్నాతో కలిసి నటించిన సమయంలో షాకింగ్ ఫలితాలే ఎదురయ్యాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో తమన్నాకు ఆఫర్లు సైతం తగ్గాయి. శ్రీ సినిమాతో టాలీవుడ్ లో కెరీర్ ను మొదలుపెట్టిన ఈ బ్యూటీకి తొలి సినిమా ఫలితమే భారీ షాకిచ్చింది. అయితే హ్యాపీడేస్ సక్సెస్ కావడంతో తమన్నా టాలీవుడ్ బిజీ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయారు. అల్లు అర్జున్ తమన్నా కాంబినేషన్ లో బద్రీనాథ్ సినిమా తెరకెక్కగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది.

అల్లు అరవింద్ ఈ సినిమాకు నిర్మాత కాగా నిర్మాతగా ఆయనకు ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. పవన్ తమన్నా కాంబోలో తెరకెక్కిన కెమెరామేన్ గంగతో రాంబాబు సినిమాకు తమన్నా అతి మైనస్ అయింది. తారక్ తమన్నా కాంబినేషన్ లో ఊసరవెల్లి తెరకెక్కగా ఈ సినిమా కూడా అంచనాలను అందుకోలేదు. చరణ్ తమన్నా కాంబో మూవీ రచ్చహిట్ గా నిలిచినా ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ ను తమన్నాకు ఇవ్వలేము.

ఈ సినిమాలో తమన్నా పాత్రకు ఉన్న ప్రాధాన్యత తక్కువనే సంగతి తెలిసిందే. ప్రభాస్ తమన్నా కాంబో మూవీ రెబల్ కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. మహేష్ తమన్నా కాంబోలో తెరకెక్కిన ఆగడు ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి1, బాహుబలి 2 సక్సెస్ సాధించినా ఆ సినిమాల సక్సెస్ కు ప్రభాస్, రాజమౌళి కారణం.

కాగా ఈ సినిమాలకు తమన్నా ఏ విధంగా ప్లస్ కాలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెజారిటీ సందర్భాల్లో స్టార్ హీరోలకు తమన్నా ఫ్లాపులిచ్చి ఆ హీరోల కెరీర్ కు మైనస్ అయిందని తమన్నా జాతకం బాలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. సీనియర్ హీరోలతో తమన్నా నటించిన సినిమాలలో ఎఫ్2 మాత్రమే హిట్ గా నిలిచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news