Moviesన‌టి ప్ర‌గ‌తికి రెండో పెళ్లి ఇష్ట‌మేనా... ఆమె జీవితంలో ఎందుకిలా జ‌రిగింది...!

న‌టి ప్ర‌గ‌తికి రెండో పెళ్లి ఇష్ట‌మేనా… ఆమె జీవితంలో ఎందుకిలా జ‌రిగింది…!

న‌టి ప్ర‌గ‌తి తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి బాగా ప‌రిచ‌యం ఉన్న న‌టి. ముఖ్యంగా ఈ వ‌య‌స్సులో కూడా ఆమె త‌న బాడీ ఫ‌ర్‌ఫెక్ట్‌గా మెయింటైన్ చేస్తూ కుర్రాళ్ల‌తో వేడిని పెంచుతూనే ఉంటోంది. అస‌లు ప్ర‌గ‌తి జిమ్ వ‌ర్క‌వుట్లు చూస్తుంటే ఈ వ‌య‌స్సులో ఈ ఫిజిక్ ఏంట్రా అని ప్ర‌తి ఒక్క షేక్ అయిపోవాల్సిందే. టాలీవుడ్లో అమ్మ‌, అక్క‌, వ‌దిన‌, అత్త పాత్ర‌ల‌కు ఇప్పుడు ప్ర‌గ‌తి కేరాఫ్‌.

ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాల్లో అమ్మ సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్‌కు అత్త‌గా, ఇటు హీరోయిన్లు త‌మ‌న్నా, మెహ్రీన్‌కు అమ్మ‌గా చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. సినిమాల‌తో పాటు సోష‌ల్ మీడియాలోనూ ప్ర‌గ‌తికి స్టార్ హీరోయిన్ల రేంజ్‌లో పాపులారిటీ ఉంది. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంది.

రెండో పెళ్లి గురించి మాట్లాడిన ప్ర‌గ‌తి సింగిల్ మ‌ద‌ర్‌ను కాబ‌ట్టి… మ‌ళ్లీ ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాల‌న్న ఆలోచ‌న వ‌చ్చిందా ? అన్న ప్ర‌శ్న‌కు ఆమె ఆన్స‌ర్ చేసింది. పెళ్లి అనే ప‌దం క‌న్నా కంపాన్యియాన్ అనేది చాలా ముఖ్యం.. చాలాసార్లు నాకు కంపాన్యియాన్ అనేది ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది.. మ‌ళ్లీ నా మెచ్యూరిటీ లెవ‌ల్‌కు మ్యాచ్ అయ్యే వాళ్లు దొర‌కాలి క‌దా ? అని చెప్పింది.

కొన్ని విష‌యాల్లో తాను ఇలాగే ఉండాల‌న్నంత ఖ‌చ్చితంగా ఉంటాన‌ని.. ఒక‌వేళ తాను 20 ఏళ్ల వ‌య‌స్సులో ఉంటే స‌ర్దుబాటు అయ్యేదానిని ఏమో ఇప్పుడు మాత్రం క‌ష్టం అని చెప్పింది. ఏదేమైనా ప్ర‌గ‌తి వ్య‌క్తిగ‌త‌, వైవాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంద‌ని ఆమె ఆవేద‌న భ‌రిత మాట‌లే చెపుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news