Moviesమ‌న టాలీవుడ్ టాప్ హీరోయిన్ల క‌ళ్లు తిరిగే రెమ్యున‌రేష‌న్లు ఇవే...!

మ‌న టాలీవుడ్ టాప్ హీరోయిన్ల క‌ళ్లు తిరిగే రెమ్యున‌రేష‌న్లు ఇవే…!

తెలుగు సినిమా మార్కెట్ బాగా పెరుగుతుంది. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఆంధ్ర, తెలంగాణతో పాటు సరిహద్దు రాష్ట్రం కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లోనూ బెంగళూరులోనూ మాత్రమే రిలీజ్ అయ్యేది. అయితే ఇప్పుడు తెలుగు సినిమా ప్రపంచం అంతా రిలీజ్ అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎన్ని దేశాల్లో ఉంటే అన్నిచోట్ల కూడా తెలుగు సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే బాహుబలి, కేజిఎఫ్, త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలు ఒక్క అమెరికాలోనే ఏకంగా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతున్న పరిస్థితి ఉంది.

దీనిని బట్టి తెలుగు సినిమా మార్కెట్ ఎంత బాగా పెరిగిందో తెలుస్తోంది. పెరిగిన మార్కెట్‌కు అనుగుణంగానే తెలుగు సినిమా బడ్జెట్ కూడా విపరీతంగా పెరుగుతుంది. నిర్మాతలు స్టార్ హీరోలతో సినిమాలు తీయాలంటే కోట్లు కుమ్మరించాల్సిన పరిస్థితి. ఇక డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్ ద్వారా కూడా ఎక్కువ ఆదాయం వస్తుండడంతో హీరోలు, హీరోయిన్లు దర్శకులు కూడా రెమ్యూనరేషన్ల‌ను విపరీతంగా పెంచేస్తున్నారు.

ఇక టాప్ హీరోయిన్లు అయితే సినిమా సినిమాకు రెమ్యూనరేషన్లు పెంచేస్తూ చుక్కలు చూపించేస్తున్నారు.
నాగచైతన్యకు విడాకులు ఇచ్చాక సమంత వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతుంది. రీసెంట్‌గా ఆమె యశోద సినిమాతో మంచి హిట్ కొట్టింది. ప్రస్తుతం ఆమె చేతుల్లో విజయ్ దేవరకొండ ఖుషి, శాకుంతలం సినిమాలతో పాటు మరో బాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు మూడు కోట్లు డిమాండ్ చేస్తుంది.

ఇక పెళ్లయినా కూడా నయనతార డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. పెళ్లికి ముందే ఆమె ఒక్కో సినిమాకు ఆరు కోట్ల వరకు తీసుకుంది. అయితే ఇప్పుడు కూడా నయనతార ఆరు కోట్లు ఇస్తేనే సినిమాకు కాల్షీట్లు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇక నాలుగు పదుల వయసుకు దగ్గరవుతున్న చెన్నై అందం త్రిష కూడా రూ. 5 కోట్లు చేస్తున్న పరిస్థితి. త్రిష‌కు తెలుగులో పెద్దగా డిమాండ్ లేదు.. ఆమెకు తక్కువ అవకాశాలు వస్తున్నా రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గటం లేదు.

ఇక రష్మిక ఛ‌లో సినిమాకు కేవలం 30 లక్షల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుంది. ఇప్పుడు అదే రష్మిక ఒక్కో సినిమాకు మూడు నుంచి నాలుగు కోట్లు డిమాండ్ చేయడంతో పాటు తనతో పాటు వచ్చే సిబ్బంది ఖర్చులు కూడా భరించాలని నిర్మాతలకు కండిషన్లు పెడుతున్న స్థితికి వచ్చేసింది. పూజా హెగ్డే నిన్న మొన్నటి వరకు నాలుగు కోట్లు తీసుకుంది. అయితే ఇప్పుడు వరుసగా ప్లాప్‌లు రావడంతో ఒక మెట్టు వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది.

త్రివిక్రమ్- మహేష్ సినిమాకు పూజకు నాలుగు కోట్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇక యంగ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల‌ తొలి సినిమాకు కేవలం 25 లక్షలు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకోగా.. ఇప్పుడు ఆమె కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా డిమాండ్ ఉండగానే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్న సూత్రాన్ని మన టాలీవుడ్ హీరోయిన్లు బాగా వంట పట్టించుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news