Moviesబాల‌య్య 108కు డేరింగ్ టైటిల్ ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి...!

బాల‌య్య 108కు డేరింగ్ టైటిల్ ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి…!

నందమూరి నటసింహం బాలకృష్ణ మానియా ఇప్పుడు టాలీవుడ్‌లోనూ, తెలుగు జ‌నాల్లోనూ మామూలుగా లేదు. సంక్రాంతికి నాలుగైదు సినిమాలు వ‌స్తున్నా వీర‌సింహారెడ్డికి ఉన్న జ‌జ్ మిగిలిన సినిమాల‌కు క‌న‌ప‌డ‌డం లేదు. ఏ హీరో అభిమాని నోట విన్నా కూడా జై బాల‌య్య అన్న స్లోగనే ఎక్కువుగా వినిపిస్తోంది. మ‌లినేని గోపీచంద్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో బాల‌య్య‌కు జోడీగా శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. కోలీవుడ్ హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇక థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేస్తున్న‌ట్టు అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చేసింది. ఇక ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయ్యింది. ఒక్క పాట మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. ఇక బాల‌య్య వెంట‌నే త‌న 108వ ప్రాజెక్టును కూడా ప‌ట్టాలు ఎక్కించేశాడు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.

ఇప్ప‌టికే ఆరు వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతోన్న అనిల్ రావిపూడి – ఫామ్‌లో ఉన్న బాల‌య్య సినిమా అంటే ఎలాంటి ర‌చ్చ ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు. అనిల్ ఎంత పెద్ద హీరో సినిమా అయినా ఆరు నెల‌ల్లో కంప్లీట్ చేసేస్తాడు. అన్నీ కుదిరితే వ‌చ్చే జూన్‌, జూలైలోనే బాల‌య్య – అనిల్ రావిపూడి సినిమా రిలీజ్ కానుంది. ఇక రీసెంట్‌గా షూటింగ్ ప్రారంభోత్స‌వం జ‌రుపుకున్న ఈ సినిమా టైటిల్ గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఈ సినిమాకు బాల‌య్య ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టుగానే “బ్రో ఐ డోంట్ కేర్” అనే టైటిల్ ఇప్ప‌టి వ‌ర‌కు అనుకున్నారు. ఇక ఇప్పుడు ద‌ర్శ‌కుడు అనిల్ కూడా అదే టైటిల్ ఫిక్స్ చేసేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ టైటిల్ చాలా డేరింగ్ గా ఉంది. బాల‌య్య ఎంత డేర్‌గా ఉంటాడో ? ఆయ‌న స్వ‌భావానికి త‌గినట్టుగా ఉంది. ఇక బాల‌య్య కూతురుగా శ్రీలీల న‌టిస్తోన్న ఈ సినిమాలో ఆయ‌న‌కు జోడీగా తెలుగ‌మ్మాయి ప్రియాంక జ‌వాల్క‌ర్‌ను ఫైన‌లైజ్ చేశార‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news