Movies"ఎవరినో సంతోషపెట్టడానికి నేను పుట్టలేదు".. మరోసారి అక్కినేని హీరోలకి ఇచ్చిపడేసిన సమంత..!!

“ఎవరినో సంతోషపెట్టడానికి నేను పుట్టలేదు”.. మరోసారి అక్కినేని హీరోలకి ఇచ్చిపడేసిన సమంత..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత .. గురించి ఎంత చెప్పినా తక్కువే . ఈ మధ్యకాలంలో ఆమె ఏం మాట్లాడిన సెన్సేషనల్ గానే క్రియేట్ అవుతుంది. మరీ ముఖ్యంగా స్టార్ హీరో నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటినుంచి సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉంటున్న సమంత ..ఆమె ఫస్ట్ టైం పాన్ ఇండియా స్ధాయిలో నటించిన యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు అభిమానులకు చెప్పుకొచ్చింది .

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సింపతి సంపాదించుకున్న సమంత యశోద తో హ్యూజ్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . కాగా ఆమె సినిమా ప్రమోషన్స్ టైం లో పలు ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ తనదైన స్టైల్ లో కౌంటర్స్ వేసి అక్కినేని హీరోలను పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆమె ఓ చానల్ తో మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ..సంచలన కామెంట్స్ చేసింది.

“లైఫ్ ని మనకు నచ్చినట్లు మనకు ఇష్టమైనట్లు బ్రతకాలి.. ఎవర్నో సంతోష పెట్టడానికి మనం పుట్టలేదు ..ఒకరి కింద మనం అనిగి ఉండాల్సిన అవసరం లేదు. దేన్నైనా సరే తట్టుకొని నిలదొక్కుకునే స్టామీనా మనకు ఉండాలి. అప్పుడే మనం లైఫ్ లో ముందుకెళ్లగలం “అంటూ తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే అక్కినేని హీరోలకు సమంత ఘాటుగా ఇచ్చి పడేసింది అంటూ సమంత ఫ్యాన్స్ ని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే సమంత మాట్లాడిన మాటల్లో నిజం ఉన్న దాని అంగీకరించలేకపోతున్నారు కొందరు అబ్బాయిలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news