Moviesమెగాస్టార్ సినిమా శృతి హాసన్‌కి షాకివ్వబోతుందా... అస‌లేం జ‌రుగుతోంది...!

మెగాస్టార్ సినిమా శృతి హాసన్‌కి షాకివ్వబోతుందా… అస‌లేం జ‌రుగుతోంది…!

మెగాస్టార్ సినిమా శృతి హాసన్‌కి షాకివ్వబోతుందా..? అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్..యాంటీ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. అందులో చిరు సరసన హీరోయిన్‌గా శృతి హాసన్ నటిస్తుండటమే. కెరీర్ ప్రారంభంలో అమ్మడు ఏ సినిమా చేసినా అట్టర్ ఫ్లాపైన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో చేసిన గబ్బర్ సింగ్ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇక్కడ్నుంచి కొన్నేళ్ళపాటు శృతి హాసన్‌ను ఎవరూ ఆపలేకపోయారు. చేసిన సినిమా చేసినట్టు హిట్ అవుతూ వచ్చింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ బక్కపలచని బ్యూటీ క్రేజీ హీరోయిన్‌గా మారింది. హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ కూడా అందుకుంది.

అయితే, శృతి హాసన్ మల్టీ టాలెంటెడ్ కాబట్టి ఒక్కో భాగానికి కొంత బ్రేక్ ఇస్తుంది. అలా యాక్టింగ్‌కి కూడా బ్రేక్ ఇచ్చింది. ఇది దాదాపు మూడేళ్ళు. కానీ, అందరూ ఈ బ్రేక్ చూసి ఇక శృతి హాసన్ పనైపోయిందని మాట్లాడుకున్నారు. కానీ, ఇలా మూడేళ్ళ గ్యాప్ వచ్చిన మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలిసి చేసిన క్రాక్ సినిమాతో శృతి హాసన్ కూడా మంచి కంబ్యాక్ ఇచ్చింది.

దీని తర్వాత ఏకంగా ప్రభాస్, బాలకృష్ణ, చిరంజీవి సరసన సినిమాలు చేసే అవకాశాలు అందుకుంది. మిగతా సినిమాల విషయం పక్కనపెడితే చిరంజీవి సరసన చేస్తున్న వాల్తేరు వీరయ్య శృతి హాసన్ కెరీర్‌ను గట్టిగా దెబ్బకొడుతుందని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకూ వచ్చిన పాటలు ఆయన స్థాయిలో లేకపోవడమే.

మరీ కుర్ర హీరో సినిమా మాదిరిగా వాల్తేరు వీరయ్య సినిమా పాటలు ఉండటం సినిమాపై అంచనాలను తారుమారు చేస్తున్నాయి. చాలామందికి హిట్ అవుతుందనే నమ్మకం కలగడం లేదంటున్నారు. ఇదే జరిగితే ఊపందుకున్న శృతి కెరీర్ మళ్ళీ స్లో అవడం ఖాయం

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news