Moviesఎన్టీఆర్-చరణ్ లలో సత్తా ఉన్న మగాడు ఎవరు..జడ్జిమెంట్ తేలేది అప్పుడేనా..?

ఎన్టీఆర్-చరణ్ లలో సత్తా ఉన్న మగాడు ఎవరు..జడ్జిమెంట్ తేలేది అప్పుడేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ కలిగి ఉన్న హీరోస్ ఏ నిర్ణయం తీసుకున్న ఆచి తూచి తీసుకుంటారన్న నమ్మకం జనాల్లో ఉంది. అయితే సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కసారి రాంగ్ స్టెప్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి . ఎంతటి పెద్ద స్టార్ హీరో అయినా సరే తప్పటి అడుగులు కచ్చితంగా వేస్తారు. అయితే ఆ తప్పటడుగులను సైతం కరెక్ట్ గా సరిదిద్దుకునేలా చేసుకోవడమే నిజమైన హీరో లక్షణం. ఇప్పుడు అలాంటి ఓ టఫ్ జోనర్లో నలిగిపోతున్నాడు ఎన్టీఆర్ – రామ్ చరణ్.

మనకు తెలిసిందే వీళ్ళిద్దరూ కలిసి గతంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా హ్యూజ్ బ్లాక్ బస్టర్ హీట్ అయింది. ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా రికార్డులు కొల్లగొట్టింది. అయితే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ..శంకర్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ ..కొరటాల శివ డైరెక్షన్లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు . కాగా ఇప్పుడు ఎన్టీఆర్-రామ్ చరణ్ పేర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా రన్ అవుతున్నాయి. దానికి కారణం బుచ్చిబాబు సనా.. సుకుమార్ శిష్యుడిగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయిన బుచ్చిబాబు సనా.. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు ను తన ఖాతాలో వేసుకున్నాడు .

అంతేకాదు సెకండ్ సినిమాకి ఎన్టీఆర్ లాంటి హీరోతో అవకాశం అందుకున్నాడని వార్తలు కూడా వచ్చాయి . నిజానికి బుచ్చిబాబు .. ఎన్టీఆర్ కి కథ చెప్పాడట. కధ కూడా నచ్చిందట . కొన్ని మార్పులు చేయమని చెప్పారట . అయితే ఆ మార్పుల కోసం ఎక్కువ టైం తీసుకున్న బుచ్చిబాబు సనా ..ఈలోపు మంచి కధ రావడంతో వేరే డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా కమిటీ అయిపోయాడు . కాగా ఎన్టీఆర్ సినిమాలు పూర్తి అవ్వాలంటే దాదాపు రెండేళ్లు , మూడేళ్లు పడుతుంది .

అంతవరకు బుచ్చిబాబు ఖాళీగా ఉండలేడు కదా ..అసలే మొదటి సినిమా తీసిన ఈ డైరెక్టర్ ఇప్పటివరకు రెండో సినిమా కూడా ప్రకటించలేదు . ఈ క్రమంలోనే అదే స్టొరీను ఎత్తుకెళ్లి రాంచరణ్ కు చెప్పాడట . మెల్ట్ అయిపోయిన రాంచరణ్ టెంప్ట్ అయిపోయి అగ్రిమెంట్ పై సైన్ కూడా చేసేసారట . జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానందుని తెలుస్తుంది . ఒకవేళ ఈ సినిమా కనుక హిట్ అయితే తారక్ నిర్ణయం రాంగ్ అని ట్రోల్ చేసే జనాలు ఉన్నారు.. ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఎప్పటిలాగే తారక్ కథల విషయంలో కరెక్ట్ గా ఆలోచించాడని పొగిడే జనాలు ఉన్నారు . చూడాలి ఇద్దరు హీరోల జడ్జిమెంట్ లో ఎవరు కరెక్ట్ గా ముందుకు వెళ్తారో..? ఆ విషయం తెలియాలి అంటే కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news