Moviesఅవకాశల కోసం పక్కలో పడుకోలా..కానీ ఆ పని చేసా..రాధిక అప్టే బోల్డ్...

అవకాశల కోసం పక్కలో పడుకోలా..కానీ ఆ పని చేసా..రాధిక అప్టే బోల్డ్ కామెంట్స్..!

రాధిక ఆప్టే ఇండియన్ సినిమా లవర్స్ కు ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హాలీవుడ్లో సినిమాలు చేయడంతో పాటు బోల్డ్ వెబ్ సిరీస్ లలో నటించిన రాధిక లండన్ కు చెందిన బెనిటిక్ టెలర్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. చాలా చిన్న వయసులోనే ఆమె ప్రేమలో పడి టేలర్‌ను సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. విచిత్రం ఏంటంటే పెళ్లి తర్వాత ఆమెకు కెరీర్ పరంగా బాగా కలిసి వచ్చింది. ముందుగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రాధిక ఆప్టే అక్కడ చాలా సినిమాల్లో నటించింది.

బోల్డ్ వెబ్ సిరీస్‌ల‌లో కూడా నటించి అందాలు ఆరబోసింది. రామ్‌గోపాల్ వ‌ర్మ దర్శకత్వంలో వచ్చిన రక్త చరిత్ర సినిమాతో సౌత్ సినిమా పరిశ్రమకు రాధిక పరిచయం అయింది. ఆ తర్వాత ఆమెకు తెలుగులో బాలయ్య లెజెండ్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. బాలయ్య సినిమాలో ఛాన్స్ అంటే మామూలు విషయం కాదు. దీనికి తోడు లెజెండ్ సూపర్ హిట్ అవడంతో పాటు.. ఆ సినిమాలో ఆమె పాత్రకు మంచి పేరు రావడంతో వెంటనే బాలయ్య నటించిన లయన్ సినిమాలోనూ ఆమెనే హీరోయిన్గా తీసుకున్నారు.

అలా స్టార్ హీరోగా ఉన్న బాలయ్య వరుసగా రెండుసార్లు రాధికకు చాన్స్ ఇచ్చినా… తెలుగులో ఆమె ఎందుకో గాని స్టార్ హీరోయిన్‌గా ఎదగలేదు. ఆ తర్వాత ఆమెకు ఎలాంటి అవకాశాలు రాలేదు.
సినీ అవకాశాలు లేకపోయినా వెబ్ సిరీస్‌ల‌లో నటిస్తూ అటు ఎప్పటికప్పుడు బోల్డ్ కామెంట్స్ చేస్తోంది. అలాగే త‌న హాట్ హాట్ ఫోటోలతో తన అభిమానులకు సోషల్ మీడియాలో వీనుల విందు చేస్తూ రాధిక ఎప్పుడు వార్తల్లో ఉంటూ వస్తోంది.

అయితే మితిమీరిన బోల్డ్ కామెంట్ల వ‌ల్ల ఒక్కోసారి ఆమె సోష‌ల్ మీడియాలో ట్రోల‌ర్స్‌కు కూడా టార్గెట్ అయ్యింది. ఇక ఆమె త‌న తాజా ఇంట‌ర్వ్యూలో కొన్ని సంచ‌ల‌న కామెంట్లు కూడా చేసింది. యంగ్ హీరోయిన్ల వ‌ల్లే త‌న‌కు అవ‌కాశాలు రావ‌డం లేద‌ని చెప్పింది. ఇక లుక్స్ వ‌ల్ల కూడా సినిమాల్లో అవ‌కాశాలు కోల్పోయారా ? అన్న ప్ర‌శ్న‌కు ఆమె బదులిచ్చింది.

సినిమాల్లో ఛాన్సులు వ‌చ్చే విష‌యంలో వ‌య‌స్సు అనేది కూడా ప్ర‌ధాన‌మైన అంశం. టాలెంట్ చూడ‌కుండా కేవ‌లం లుక్స్‌ను బ‌ట్టి హీరోయిన్ ఛాన్సులు ఇవ్వ‌డం అనేది.. ఇండియాలో మాత్ర‌మే కాదు.. విదేశాల్లోనూ ఉంది. ఇక తాను ఎప్పుడూ అందం మాయ‌లో ప‌డ‌లేద‌ని.. అందంగా క‌నిపించేందుకు స‌ర్జ‌రీలు కూడా చేయించుకోలేద‌ని.. అవ‌కాశాల కోసం ఎక్క‌డా ప‌డుకోలేదు.. ఏ అడ్డ‌దారులు తొక్క‌లేద‌ని.. అయితే చాలా ఇబ్బందులు ప‌డ్డాన‌ని చెప్పింది. అయితే గ‌తంలో తాను తెలుగు సినిమాల్లో న‌టిస్తున్న‌ప్పుడు ఓ హీరో వ‌ల్ల కూడా ఇబ్బందులు ప‌డ్డాన‌ని ఆమె చేసిన వ్యాఖ్య‌లు కూడా అప్ప‌ట్లో హాట్ టాపిక్ అయ్యాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news