Moviesఆ సెంటిమెంట్ రిపీట్ అయితే వీర‌య్య అట్ట‌ర్‌ప్లాప్‌... వీర‌సింహారెడ్డి బ్లాక్‌బ‌స్ట‌రే...!

ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే వీర‌య్య అట్ట‌ర్‌ప్లాప్‌… వీర‌సింహారెడ్డి బ్లాక్‌బ‌స్ట‌రే…!

టాలీవుడ్‌లో వ‌చ్చే సంక్రాంతి పోరు మామూలుగా ఉండేలా లేదు. ఇద్ద‌రు పెద్ద హీరోలు న‌టిస్తోన్న రెండు క్రేజీ ప్రాజెక్టులు చిరంజీవి వాల్తేరు వీర‌య్య‌, బాల‌య్య వీర‌సింహారెడ్డి రెండు సినిమాలు ఒక్క రోజు తేడాలో థియేట‌ర్ల‌లోకి దిగుతున్నాయి. అయితే బాల‌య్య‌, చిరు మ‌ధ్య ఎప్పుడు పోటీ జ‌రిగినా మ‌జానే. అందులో సంక్రాంతి పోటీ జ‌రిగితే మ‌రింత మ‌జా ఉంటుంది. గ‌తంలో రెండు సార్లు హోరాహోరీగా జ‌రిగిన పోరులో 1999 సంక్రాంతికి స‌మ‌ర‌సింహారెడ్డి సినిమాతో స్నేహంకోసం సినిమాపై బాల‌య్య ఇండ‌స్ట్రీ హిట్‌తో పైచేయి సాధించాడు.

ఆ త‌ర్వాత 2001 సంక్రాంతికి చిరు మృగ‌రాజు, బాల‌య్య న‌ర‌సింహానాయుడు సినిమాతో పాటు వెంక‌టేష్ దేవీపుత్రుడు సినిమా కూడా వ‌చ్చింది. న‌ర‌సింహానాయుడు ఇండ‌స్ట్రీ హిట్‌.. మృగ‌రాజు చిరు కెరీర్‌లోనే పెద్ద డిజాస్ట‌ర్‌. దేవీపుత్రుడు యావ‌రేజ్ అయ్యాయి. అయితే ఈ సంక్రాంతికి చిరు, బాలయ్య ఇద్ద‌రు న‌టించిన సినిమాల్లోనూ హీరోయిన్ సిమ్రానే. మృగ‌రాజులో సిమ్రాన్ మెయిన్ హీరోయిన్‌… సైడ్ హీరోయిన్ సంఘ‌వి. ఇక న‌ర‌సింహానాయుడులో సిమ్రాన్ మెయిన్ హీరోయిన్ కాగా ప్రీతిజింగానియా, ఆశాషైనీ కూడా న‌టించారు.

అలా ఆ సంక్రాంతికి ఈ ఇద్ద‌రు హీరోల‌కు జోడీగా ఒకే హీరోయిన్ న‌టించ‌గా.. అప్పుడు చిరు సినిమా ప్లాప్ అయితే బాల‌య్య ఇండ‌స్ట్రీ హిట్ కొట్టాడు. మ‌ళ్లీ 22 ఏళ్ల త‌ర్వాత ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. అదే ఇద్ద‌రు హీరోలు.. అదే సంక్రాంతి పోరు.. సేమ్ ఒక్క‌టే హీరోయిన్‌..! ఈ ఇద్ద‌రు హీరోల సినిమాల్లోనూ శృతీహాస‌న్ హీరోయిన్‌. మ‌రి నాడు ఉన్న సెంటిమెంట్ 2023 సంక్రాంతికి కూడా రిపీట్ అయితే చిరు వాల్తేరు వీర‌య్య‌పై బాల‌య్య వీర‌సింహారెడ్డి పైచేయి సాధిస్తుంది. మ‌రి ఈ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా ? లేదా ? తెలియాలంటే సంక్రాంతి వ‌ర‌కు ఆగాల్సిందే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news