Moviesటాలీవుడ్‌లో ఫుల్లుగా మందుకొట్టే అల‌వాటు ఉన్న‌ హీరోయిన్లు వీళ్లే...!

టాలీవుడ్‌లో ఫుల్లుగా మందుకొట్టే అల‌వాటు ఉన్న‌ హీరోయిన్లు వీళ్లే…!

సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలోకి ఒక్కసారి ఎంటర్ అయ్యాక ఎంత తెల్లటి మనసుతో ఉన్నవారు అయినా అక్కడ అక్కడ రంగుల మాయలో పడిపోవాల్సిందే. చాలామంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగిపోవాలని.. వెండితెరపై తమను తాము చూసుకోవాలని ఎన్నో కలలతో అక్కడ అడుగు పెడతారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేముందు చాలా పద్ధతిగా ఉండే అమ్మాయిలు అంతా.. స్టార్ హీరోయిన్లు అయిన వెంటనే తమ బిహేవియర్ మార్చేస్తారు. తాము ఎక్కడ నుంచి వచ్చాము ? అన్న‌ది వ‌దిలేసి.. తమ సంస్కృతి, సంప్రదాయాలను కూడా మర్చిపోతారు.

సరికొత్త ఊహ ప్రపంచంలోకి వెళ్లిపోతారు. స్టార్ హీరోయిన్ అయ్యాక చెడు అలవాట్లకు బానిస అయ్యి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఇప్పటి తరం హీరోయిన్లు తాగటం, సిగరెట్లు ఊదటం.. పబ్బులకు, క్లబ్బులకు వెళ్లటం కామన్ అయిపోయింది. అయితే పాత తరంలోనూ మహానటి సావిత్రితో మొదలుపెడితే చాలామంది హీరోయిన్లు మద్యానికి బానిసై తమ కెరీర్ నాశనం చేసుకున్నారు.
ఇటీవల కాలంలో కొందరు హీరోయిన్లు పూటుగా మద్యం సేవిస్తూ మీడియా కంటపడిపోయారు. మరికొందరు పబ్బుల్లోనూ… క్లబ్బుల్లోనూ మందు కొడుతూ అడ్డంగా దొరికిపోయారు.

విశ్వ‌న‌టుడు కమలహాసన్ కూతురు శృతిహాసన్ షూటింగ్లో లేకపోతే బెంగళూరులో పబ్బులకు వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తూ మందు కొడుతుందన్న టాక్ ఉంది. ఒకవేళ హ్యాంగ్ ఓవర్ అయితే శృతి చాలా లేటుగా షూటింగ్ కు వస్తుందన్న గుసగుసలు కూడా ఉన్నాయి. ఒకప్పటి సీనియర్ హీరోయిన్ ఊర్వశి కూడా మద్యం తాగుతుందట. అంతేకాకుండా గతంలో ఒకటి రెండు సార్లు ఆమె ఫుల్లుగా మందు కొట్టి ఫంక్షన్లకు హాజరై తూలిపోయిన సందర్భాలు ఉన్నాయన్న ప్రచారం జరిగింది. అందుకు సంబంధించిన వీడియోలు కూడా యూట్యూబ్లో దర్శనమిస్తూ ఉంటాయి.

ఇక చెన్నై అందం త్రిష కూడా చాలాసార్లు ఫుల్లుగా మద్యం తాగి మీడియాకు, పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఎక్కడో ఎందుకు ? హైదరాబాదులో దగ్గుబాటి రానాతో మందు కొట్టి తూలిపోతూ మీడియా కెమెరాలకు చిక్కిన సంగతి తెలిసిందే. అలాగే ఓ స్టార్ హీరోతో కలిసి మందు కొట్టి గోవాలోనూ దొరికిపోయిందన్న టాక్ బయటకు వచ్చింది.

ఇక దేశముదురు ముద్దుగుమ్మ హన్సిక సైతం సినిమాల్లో నటించినప్పుడు కొన్ని సీన్లలో తాగి నటించాల్సి వస్తే నిజంగానే తాగి సెట్స్ కు వచ్చి నానా హడావుడి చేసిందట. వీరు మాత్రమే కాదు శ్రద్ధాదాస్ – ఛార్మి లాంటి హీరోయిన్లు ఓపెన్ గానే మందు కొడుతున్న ఫోటోలు ఎన్నోసార్లు బయటకు వచ్చాయి. ఇక పాత తరం హీరోయిన్లలో మహానటి సావిత్రి – శుభ ఇలా ఎంతోమంది క్రేజీ హీరోయిన్లు మద్యానికి బానిసై తమ కెరీర్నే పోగొట్టుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news