Moviesరేవ్ పార్టీకి వెళ్లిన విషయాన్ని హేమ అందుకే దాచిందా..? ఆ వీడియో...

రేవ్ పార్టీకి వెళ్లిన విషయాన్ని హేమ అందుకే దాచిందా..? ఆ వీడియో ఐడియా ఇచ్చింది ఆ స్టార్ డైరెక్టరా..?

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ దేశవ్యాప్తంగా ఎన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో మనకు తెలిసిందే. సాధారణంగా స్టార్ సెలబ్రిటీస్ వీకెండ్స్ ఇంట్లో ఉండరు. అందరు సెలబ్రిటీస్ అలా ఉంటారు అని మనం చెప్పలేం చాలామంది మాత్రం లైఫ్ ఎంజాయ్ చేయడానికి పార్టీలకి పబ్బులకి వెళ్తూ ఉంటారు . మరి కొంతమంది హద్దులు మీరు పోయే రేంజ్ లో రేవ్ పార్టీల పేరిట మందు తాగుతూ డ్రగ్స్ తీసుకుంటూ ఒళ్ళు తెలియకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటారు . డబ్బున్న ఇంట్లో ..డబ్బు ఉన్న పిల్లలకి ఇవి చాలా చాలా సిల్లీగా కామన్ గా అనిపిస్తూ ఉంటాయి. అయితే తాజాగా బెంగుళూరు నగర శివారులో జరిగిన రేవ్ పార్టీ ఎంత సంచలనంగా మారిందో మనకు తెలిసిందే .

మరీ ముఖ్యంగా ఈ రేవ్ పార్టీకి వందమందికి పైగా ప్రముఖులు స్టార్ సెలబ్రిటీలు హాజరయ్యారు అంటూ పోలీసుల విచారణలో బయటపడింది . అంతేకాదు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది ప్రముఖులు హాజరైనట్లు పోలీసులు తమ విచారణలో కనిపెట్టారు . అయితే ఇదే క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న హేమ సైతం బెంగళూరు రేవ్ పార్టీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు . అయితే కన్నడ మీడియాలో వార్తలు రాగానే అలర్ట్ అయిపోయింది హేమ.

” నేను ఎక్కడికి వెళ్ళలేదు.. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను అంటూ ఒక సెల్ఫీ వీడియోను రిలీజ్ చేసింది . అయితే హేమ బెంగళూరులో రేవ్ పార్టీలో ఉన్నట్లు కన్నడ పోలీసులు వీడియో.. ఫొటోస్ కూడా రిలీజ్ చేశారు . ఆమె నేను హైదరాబాద్ లోనే ఉన్నాను అంటూ చెప్పిన వీడియో లో వేసుకున్న డ్రెస్ ఆమె పార్టీకి వెళ్ళినప్పుడు వేసుకున్న డ్రస్ ఒకటే కావడం అందరికీ షాకింగ్ అనిపిస్తుంది . మరి ఆమె ఎందుకు ఆ విషయాన్ని దాచి పెట్టింది ..? సడన్గా ఆమె రాత్రికి రాత్రి బెంగళూరు నుంచి హైదరాబాద్ కి ఎలా వచ్చేసింది ..? అనే విషయాలు బాగా వైరల్ గా మారాయి .

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం హేమ అంటే మొదటినుంచి జాన్ జిగిడి ఫ్రెండ్ షిప్ ఉన్న స్టార్ డైరెక్టర్ ఆమెను ఈ కేసులో నుంచి బయటపడడానికి చూస్తున్నాడు అని ..ఆయన సలహా మేరకే హేమ రేవ్ పార్టీకి వెళ్లలేదు అంటూ వీడియో కూడా రిలీజ్ చేసింది అని..లేకపోతే హేమ ఉన్నది ఉన్నట్లు ఒప్పుకునే క్యారెక్టర్ అని ..ఆ డైరెక్టర్ నమ్ముకొని హేమా ఇప్పుడు చిక్కుల్లో ఇరుకున్నింది అని కామెంట్స్ చేస్తున్నారు జనాలు, అసలు హేమ ఆ రేవ్ పార్టీకి వెళ్లిందా..? వెళ్తే ఎందుకు వెళ్ళింది..? వెళ్ళిన విషయాన్ని ఎందుకు దాచింది..? మధ్యలో ఈ టాలీవుడ్ డైరెక్టర్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు ..? ఈ నిజా నిజాలు బయటపడాలి అంటే హేమ నోరు విప్పాల్సిందే..!?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news