Moviesచిరంజీవి ఖాతాలో ఆచార్యకు మించిన ఫ్లాప్ పక్క.. ఆ డైరెక్టర్ కు...

చిరంజీవి ఖాతాలో ఆచార్యకు మించిన ఫ్లాప్ పక్క.. ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చాడు ఏంటి..?

ఎంత పెద్ద తోపైనా స్టార్ అయినా .. టాప్ మోస్ట్ హీరో -హీరోయిన్ అయినా.. కొన్ని కొన్ని సార్లు తమ కెరియర్ విషయంలో రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ప్రెసెంట్ చిరంజీవి సైతం అలాగే చేస్తున్నారు అంటున్నారు అభిమానులు. విశ్వంభర సినిమా షూట్ లో బిజీగా ఉన్న చిరంజీవి వశిష్టను నమ్మి అవకాశం ఇవ్వడానికి ఎంత టైం తీసుకున్నాడో అందరికీ తెలిసిన విషయమే . చాలామంది అనుకుంటూ ఉంటారు . చిరంజీవి స్టోరీస్ చూసింగ్ విషయంలో చాలా ధిట్ట అని ..

ఆయన ఓకే చేసిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతాయి అని.. అఫ్కోర్స్ అదంతా ఫస్ట్ ఇన్నింగ్స్ లో .. ఎప్పుడైతే కెరీర్ కు బ్రేక్ చెప్పి ఆ తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసారో.. అప్పటినుంచి చిరంజీవి సినిమాల చూసింగ్ విషయంలో వెనకడుగు వేస్తున్నారు. రాంగ్ స్టెప్ తీసుకుంటున్నారు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఒక ఫ్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడు అన్న వార్త మెగా అభిమానులకు మండిపోయేలా చేస్తుంది.

ఆయన మరెవరో కాదు . మోహన్ రాజా . గాడ్ ఫాదర్ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ . ఆల్రెడీ వీళ్ళ కాంబోలో గాడ్ ఫాదర్ వచ్చి జనాలను నిరాశపరిచింది. మరి అలాంటి డైరెక్టర్ కి ఛాన్స్ ఎలా ఇస్తావు ..? బాసు అంటూ మెగా ఫ్యాన్స్ నిలదీసేస్తున్నారు . అంతేకాదు ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు.. మంచి మంచి డైరెక్టర్స్ ఎంతోమంది ఇండస్ట్రీలో ఉన్నారు . వాళ్ళకి అవకాశాలు ఇవ్వచ్చుగా.. కొత్త డైరెక్టర్ లు చాలా కష్టపడుతున్నారు .. వాళ్ళతో ట్రై చేయొచ్చుగా అంటూ సజెస్ట్ చేస్తున్నారు . మరికొందరు మోహన్ రాజా తో కమిట్ అయితే ఆచార్యకు మించిన డిజాస్టర్ పక్క అంటూ తేల్చేస్తున్నారు . మొత్తానికి సోషల్ మీడియాలో ఇప్పుడు చిరంజీవి పేరు మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news