Moviesనయన్ కి కవల పిల్లలు..బ్యాన్ చేసేయాలి.. సీనియర్ హీరోయిన్ సంచలన...

నయన్ కి కవల పిల్లలు..బ్యాన్ చేసేయాలి.. సీనియర్ హీరోయిన్ సంచలన ట్వీట్..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఒకటే న్యూస్ వైరల్ గా మారింది. అదే నయనతారకు కవల పిల్లలు పుట్టడం. అఫ్కోర్స్ ఇలాంటి సందర్భంలో ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు. గుడ్ న్యూస్ చెప్పిందని కంగ్రాట్స్ చెప్తారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం నయనతార విగ్నేష్ జంటను దుమ్మెత్తి పోస్తున్నారు. మనకు తెలిసిందే నయనతార ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కరెక్ట్ గా ఈ జంట పెళ్లి చేసుకుని నిన్నటికి నాలుగు నెలలు పూర్తయింది. అయితే నాలుగు నెలలు పూర్తయిన శుభసందర్భంలో వీళ్ళు మేము తల్లిదండ్రులు అయ్యాము అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

దీంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు.. మీడియా లోకం షేక్ అయింది. పెళ్లయిన నాలుగు నెలలకే ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన తల్లిగా నయనతార సంచలన రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఇది అంత సరోగసి ద్వారా జరిగినట్లు కోలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది . అయితే పెళ్లికి ముందే వీళ్ళు ఇలా చేయడం అది కూడా ఇలాంటి స్టార్ పొజిషన్లో ఉన్న వ్యక్తులు సరోగసి ద్వారా పిల్లలను కనడం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది . జనరల్ గా ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు .. సరోగసి ప్రాసెస్ ను అప్రోచ్ అవుతారు. అయితే నయనతార విగ్నేశ్ శివన్ లకు ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా మరి ఎందుకు సరోగసి ద్వారా పిల్లల్ని కన్నారు అంటూ అభిమానులు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే కోలీవుడ్ బ్యూటీ కస్తూరి నయనతార విగ్నేశ్ శివన్ నిర్ణయం పై సంచలన వ్యాఖ్యలు చేసింది. “సరోగసి ప్రాసెస్ ని తప్పు పట్టడం కాదు కనీ ఇలాంటి ప్రాసెస్ ఆరోగ్యం బాగోలేని వాళ్లు చూస్ చేసుకుంటారు. హెల్తీ గా ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి ప్రాసెస్ ను ఫాలో అవుతుండడం కరెక్ట్ పద్ధతి కాదని చాలామంది సినీ సెలబ్రిటీస్ చెప్పుకొస్తున్నారు” .అయితే ఈ లిస్టులోకే యాడ్ అయింది నాగార్జున బ్యూటీ కస్తూరి. నయనతార కావల పిల్లలు పుట్టిన వేల సీనియర్ హీరోయిన్ కస్తూరి చేసిన ట్విట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ” సరోగసి విధానం ఇండియాలో ఆల్రెడీ బ్యాన్ చేయబడింది. దీని గురించి త్వరలోనే మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. కొన్ని అనివార్య ఆరోగ్యాల కారణం ఉంటే తప్ప ఈ విధానాన్ని అనుసరించకూడదు. ఈ ఏడాది జనవరి నుంచి ఇది చట్టం చేయబడింది “అంటూ పరోక్షంగా నయనతారను ఉద్దేశించి కౌంటర్ వేసింది. దీంతో ఆమె ట్వీట్ వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news