Moviesఎన్టీఆర్ ని నమ్మించి చీట్ చేసిన వ్యక్తి.. ఏం చేసాడొ తెలిస్తే...

ఎన్టీఆర్ ని నమ్మించి చీట్ చేసిన వ్యక్తి.. ఏం చేసాడొ తెలిస్తే తారక్ కి దండంపెట్టేస్తారు..!!

సినిమా ఇండస్ట్రీ లోకి తాత గారి పేరు చెప్పుకొని వచ్చిన నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే . సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్ని ఏళ్ల అవుతున్న ఇప్పటివరకు ఏ హీరోయిన్ ఏ హీరో కానీ నందమూరి ఎన్టీఆర్ పై కంప్లైంట్ ఇవ్వలేదు . అనవసరంగా ఏ విషయాల్లో తల దూర్చాడు.. తన జోలికి వస్తే మాత్రం వదలడు . ఉన్నది ఉన్నట్టు ముఖాన్ని మాట్లాడే వాళ్లు ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు . వాళ్ళల్లో నెంబర్ వన్ స్థానంలో ఉంటాడు ఎన్టీఆర్ అని ఏమాత్రం సందేహం లేకుండా చెప్పొచ్చు. ఏ ఇంటర్వ్యూలోనా సరే తారక్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాడు. ఫేస్ మీదే తప్పో ఒప్పో ఆన్సర్ ఇచ్చేస్తాడు అంతటి గట్స్ ఉన్న తెలుగు హీరో.

మనకు తెలిసిందే ఎన్టీఆర్ ఫ్రెండ్ షిప్ కి చాలా వాల్యూ ఇస్తారు . కష్టం అంటూ తన ఫ్రెండ్స్ ఎవ్వరిని చూసిన సరే వాళ్ళు అడగకపోయినా సహాయం చేస్తారు. అలాంటి ఫ్రెండ్షిప్ ని వాడుకొని వదిలేసాడు ఓ నీచమైన ఫ్రెండ్ . యస్ ఎన్టీఆర్ ఫ్రెండ్స్ లల్లో ఆయన బాగా నమ్మే వాళ్ళల్లో ఈయన కూడా ఒకడు .సినిమా ఇండస్ట్రీకి చెందిన వాడే. ఎన్టీఆర్ కెరియర్ స్టార్టింగ్ అప్పటినుంచి ఆయనతో కొనసాగుతూనే వచ్చాడు. అయితే సింహాద్రి హిట్ తరవాత ఒక్కసారిగా తారక్ రేంజ్ మారిపోయింది. ఆయన పై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి . ఈ క్రమంలోనే ఆ హీరో తన అవసరాల కోసం ఎన్టీఆర్ పేరు చెప్పుకొని ..ఎన్టీఆర్ పేరుని వాడుకొని కొందరి దగ్గర డబ్బులు తీసుకున్నాడట .

అంతేకాదు ఆ విషయాన్ని ఎన్టీఆర్ కు చెప్పలేదు. అయితే ఒక్కసారిగా ఆంధ్రావాలా, సాంబ , నా అల్లుడు.. వరుసగా మూడు డిజాస్టర్లు పడేసరికి ఎన్టీఆర్ కెరియర్ గ్రాఫ్ కొంచెం డౌన్ అయింది. ఈ టైంలో ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఎన్టీఆర్. ఆ టైంలోనే ఒక్కసారిగా ఆ ఫ్రెండ్ కి అప్పులు ఇచ్చిన జనాలు మొత్తం ఎన్టీఆర్ పై పడ్డారు. “మీ జాన్ జిగిడి ఫ్రెండ్ నీ పేరు చెప్పుకుని మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఇప్పుడు మీ మార్కెట్ పడిపోయింది..మాకు నమ్మకం లేదు. మా డబ్బులు మాకు ఇవ్వు” అంటూ పీకల మీద కూర్చున్నారట . ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తను దాచుకున్న డబ్బులను మొత్తం ఇచ్చేసాడట . నందమూరి తారక రామారావు అన్న పేరు పై ఎటువంటి చెడు మాటలు వినకూడదు అన్న కారణంతోనే ఎన్టీఆర్ మొత్తం ఇచ్చేసాడట. తను దాచుకున్న డబ్బులు మొత్తం వాళ్ళకి ఇచ్చేసారట. ఈ క్రమంలోనే అతడు వచ్చి ఎన్టీఆర్ కు సారీ చెప్పినా ఎన్టీఆర్ క్షమించలేదట. ” నీ అవసరాలకు నా పేరు వాడుకుని,, నా పరువు తీయాలని చూసావ్.. ఇక జన్మలో నేను నమ్మను” అంటూ దూరం పెట్టడట .ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటికి ఎన్టీఆర్ ఆయన ను దూరం పెట్టే ఉన్నాడట. అలా నమ్మితే ప్రాణాలు ఇచ్చే ఎన్టీఆర్ నమ్మకద్రోహం చేస్తే చచ్చినా మాట్లాడడు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news