Moviesఇంట్రెస్టింగ్: మిగతా హీరోలలో లేనిది..చిరంజీవి లో ఉన్నది ఇదే..ఏం ఫ్యాన్స్ నిజమేగా...

ఇంట్రెస్టింగ్: మిగతా హీరోలలో లేనిది..చిరంజీవి లో ఉన్నది ఇదే..ఏం ఫ్యాన్స్ నిజమేగా ..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోలు చాలామంది ఉంటారు . కానీ మెగాస్టార్ లాంటి హీరో మాత్రం ఒక్కరే ఉంటారు . అది జనం ఎరిగిన సత్యం . ఎటువంటి హెల్ప్ లేకుండా సినీ ఇండస్ట్రీ లోకి వచ్చి.. తనదైన స్టైల్ లో నటించి, కష్టపడి.. నార్మల్ హీరో నుంచి స్టార్ హీరోగా.. ఆ తర్వాత జనాల చేత మెగాస్టార్ అనే బిరుదు తీసుకొని మెగా హీరోగా సినీ ఇండస్ట్రీలో తన సినీ ప్రస్థానాన్ని కంటిన్యూ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే . చెప్పే కొద్ది ఇంకా చెప్పాలనిపిస్తుంది. వింటున్న వాళ్లకి ఇంకా వినాలి అనిపిస్తుంది .

అలాంటి పేరు మెగాస్టార్ చిరంజీవి జనాల దగ్గర నుండి సంపాదించుకున్నారు. కాగా సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంటర్ అవ్వడం ఎంత ముఖ్యమో ..ఎంటర్ అయిన తరువాత నలుగురికి ఆదర్శంగా నిలవడం కూడా అంతే ముఖ్యం . మనం ఇప్పుడున్న హీరోలలో చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి లాగా మిగతా ఏ హీరో లేరు. అందరి హీరోలు వాళ్ళు సెటిల్ అయ్యామా.. డబ్బులు వెనకేసుకున్నామా.. ఇలాగే ఆలోచిస్తున్నారు. కానీ మెగా హీరో లాగా మిగతా టాలెంట్ ఉన్న హీరోలని సెటిల్ చేయాలన్న ఆలోచన ఎవరికీ లేదు.

ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే ..మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని కొంతమంది ..మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని మరి కొంతమంది …సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే ఇప్పటి వరకు ఏ హీరో కూడా ఇండస్ట్రీలో ఉండే మిగతా హీరోల పేర్లు చెప్పుకొని మేం ఇండస్ట్రీలోకి వచ్చాం అని చెప్పిన దాఖలాలు లేవు . ఈ రకంగా చూసుకుంటే చిరంజీవికి కుళ్ళు కుతంత్రాలు తెలియవు . మనస్ఫూర్తిగా వేరే వాళ్ళు ఎదగాలని కోరుకుంటారు అని మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు. అంతేకాదు ఇప్పటికి మనం చూసుకున్నట్లయితే మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని సినిమా ఇండస్ట్రీలోకి వస్తున్న యంగ్ హీరోల లిస్ట్ రోజు రోజుకి పెరిగిపోతుంది ఇది నిజంగా శుభ పరిణామం అనే చెప్పాలి . ఏది ఏమైనా సరే ఇండస్ట్రీలో కుళ్ళు కుతంత్రాలు లేని హీరో మెగాస్టార్ అంటూ మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news