Moviesసైలెంట్ షాక్: పెళ్ళి కి రెడి అయిన దేత్తడి హారిక..అబ్బాయి మనకి...

సైలెంట్ షాక్: పెళ్ళి కి రెడి అయిన దేత్తడి హారిక..అబ్బాయి మనకి బాగా తెలిసినవాడే..!?

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో వరుసగా స్టార్ సెలబ్రిటీస్ అందరూ పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే బుల్లితెరపై కూడా సీరియల్ నటులు, యాంకర్లు ,పెళ్లి చేసుకొని ఓ ఫ్యామిలీ ఏర్పాటు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా స్టార్ సెలబ్రెటీ గా పేరు సంపాదించుకున్న ప్రముఖ యూట్యూబర్ దేత్తడి హారిక పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఆధారంగా దేత్తడి హారిక గత కొంతకాలంగా ఓ అబ్బాయిని ప్రేమిస్తుందని ..ఆ అబ్బాయి తనతో పాటు వీడియోస్ చేస్తున్నాడని ..త్వరలోనే హారిక అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుందని ..న్యూస్ హల్చల్ చేస్తుంది.


కాగా దేత్తడి హారిక షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే . తనలోని టాలెంట్ బుల్లితెరపైనే కాదు సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులకు దగ్గర అవచ్చు అంటూ తెలంగాణ భాష మాట్లాడుతూ ఆ యాసలో అభిమానులను కట్టిపడేసింది . నిజం చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లక ముందుకు వరకు దేత్తడి హారిక హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అయితే హౌస్ లో తోటి కంటెస్టెంట్ అభితో ఆమె నడిపిన యవ్వారం జనాలకు నచ్చలేదు .

అంతేకాదు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక వీళ్ళిద్దరూ బ్రేకప్ అంటూ ఓ న్యుస్ వైరల్ గా మారింది. ఆ తర్వాత కొన్నాళ్లకి మళ్ళీ కలిసి ఫోటో దిగినా.. ప్రజెంట్ వీళ్ళిద్దరి మధ్య యవ్వారం చెడిందని అంటున్నారు .ఈ క్రమంలోనే దేత్తడి హారిక అతడి కన్నా మించిపోయే అందం, టాలెంట్ ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ యూట్యూబఅర్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు దీనిపై దేత్తడి హారిక గాని వాళ్ళ అమ్మగారు గాని ఎటువంటి అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు . మరి చూడాలి ఈ వార్తలో ఎంత నిజం ఉందో హారిక ఈ వార్తపై ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news